padyam-hrudyam

kavitvam

Tuesday, March 29, 2011

విగ్రహాలు












కృష్ణ రాయల కీర్తి కీడు కల్గించెనా ?
.................బ్రహ్మ నాయుండన్న భయమ నీకు?
నన్నయ, యెర్రన నగుబాటు జేసిరా?
.................క్షేత్రయ్య, మొల్లలు చెడిరె నీకు?
సిద్ధేంద్ర యోగులు సిగ్గిల జేసిరా?
.................బళ్ళారి రాఘవ పరుడె నీకు?
అన్నమయ్య పదాలు చిన్న బుచ్చెనె నిన్ను?
.................జాషువా, శ్రీశ్రీ లు శత్రు లైరె?
రఘుపతి, ముట్నూరి రచ్చ చేసిరె నిన్ను?
.................రామలింగా రెడ్డి రంకె లిడెనె ?
గురజాడ, చౌదరి ఘూర్ణిల్ల జేసిరే ?
.................వీరేశ లింగము వెతల నిడెనె ?
ఆర్థరు కాటను ఆరడి బెట్టెనే ?
.................పింగళి వెంకయ్య దొంగ యగునె?

చూడ లేనట్టి యంధుని చూడ్కి నీవు
వ్యవహ రించితి వీనాడు అధము డవయి
తెలుగు మహనీయ మూర్తుల వెలుగు జూపు
విగ్రహ మ్ముల పైననా నాగ్ర హమ్ము?

2 comments:

హనుమంత రావు said...

మిస్సన్నా...మిస్సవుతున్నానయ్యా నీ పద్యం హృద్యం.....ఎందుకంటే ఏం చెప్పను...అందుకే ఏమీ చెప్పను. ఇవ్వాళ అలా తిరుగుతూ నీ బ్లాగులోకి వచ్చా....విగ్రహాల్ని ధ్వంసం చేసిన తుచ్ఛుల్ని ఉద్దేశించివ్రాసిన పద్యం నిజంగా హృద్యంగా వుంది....తలచుకుంటే చాలా బాధ కలుగుతున్నది వారి దుశ్చర్యకు.....
శంకరాభరణంలో నీ పూరణలు చాలా బాగున్నాయి....వాటికి నా వ్యాఖ్య వ్రాయడానికి నాకు శక్తిలేదు///బాగున్నాయి అని మాత్రం అనగలను....

మిస్సన్న said...

అయ్యా గురువుగారూ ఏం చెప్పినా తరచూ మిస్ అవకండి. 'కాలో దురతిక్రమః ' అన్నారు పెద్దలు (సరిగానే చెప్పేనంటారా?) ఎందఱో మహానుభావులు! అందరికీ వనదనాలు చేసుకొంటూ పోవడమే మనపని. భవదీయుడు - మిస్సన్న.