padyam-hrudyam

kavitvam

Saturday, March 24, 2012

చిన్మయ రూపిణీ !


ఋతువులు కాలముల్ దినము రేబవళుల్ విషువత్తు సంధ్యలున్
చతురత మీర జేసి గతి చక్రపుటాకుల వేగ ద్రిప్పుచున్
బ్రతుకున కష్ట నష్టములు బాధలు మోదము జన్మ మృత్యువుల్
అతి సహజమ్ము లందు వహహా భళి చిన్మయ రూపిణీ! పరా!

Friday, March 23, 2012

సంతత సమ్మద ప్రియ......


" ఎంత కఠోర మా గళము! ఏమది కోయిలె? ఎంత తొందరో!
వింత! చిగిర్చె మావియును! వేములు పూచెను! వెల్గె ధాత్రి! నీ
వంతిక రమ్ము! తాళను రవంత " యనెన్ తలయూచి శైత్యమున్!
సంతత సమ్మద ప్రియ వసంతము వచ్చె దిగంత కాంతమై!