padyam-hrudyam

kavitvam

Tuesday, November 6, 2018

నరకాసుర వధ




కస్సున పడగెత్తి కాటువేయగ నెంచు
.....కాలాహి రీతిగా వ్రేల వేణి
సర్పంపు ముఖమున చయ్యన వెలివచ్చు
.....నాలుక రీతిగా చేల మెసగ
నెక్కు పెట్టిన విల్లు గ్రక్కున దరిజేరి
.....యెరగొను మిత్తి వా తెరవు దోప
లాగగా వింటిని సాగిన చేతూండ్లు
.....కాల పాశము రీతి కదలుచుండ

కన్ను తామర లెఱ్ఱనై కలత బెట్ట 
ధరణి యొడిలోన దలవాల్చు తరుణ మనుచు
భీతి జెందగ నరకుడు నాతి సత్య
విక్రమించెను కృష్ణుడు విశ్రమించ. 

Friday, August 24, 2018

వరలక్ష్మీ నమోస్తుతే.



పద్మకర! ప్రసన్నాస్య! సౌభాగ్యదాయి!
భాగ్యదా! భయభంజన భవ్యహస్త!
మణిగణాంచిత నానాభరణ వికాస!
దయను చూడుము వరలక్ష్మి! దండమమ్మ!

భక్త వాంఛాఫలప్రదా! బ్రహ్మ విష్ణు
శంకరాది సంసేవిత! శంఖపద్మ
పంకజాదినిధాన సంభావితాంక!
దయను చూడుము వరలక్ష్మి! దండమమ్మ!

సరసిజనయన! సరసిజకర! భగవతి!
శ్వేతగంధానులేపన! శ్వేత వస్త్ర!
శ్వేత మాల్యసుశోభిత ! విష్ణుపత్ని!
దయను చూడుము వరలక్ష్మి! దండమమ్మ!


Tuesday, July 31, 2018

గురు చరిత్రలు

*వ్యాస పూర్ణిమ/గురు పూర్ణిమ సందర్భంగా గురువుల సంబంద 73 పుస్తకాలు, 27  ప్రవచనాలు ఒకేచోట ఉచితంగా తెలుగులో*
------------------------------------------------
          ***పుస్తకాలు***
వేదవ్యాస మహర్షి జీవిత చరిత్ర http://bit.ly/Guruvu-1

గురు విజ్ఞాన సర్వస్వము http://bit.ly/Guruvu-2

వసిష్ఠ మహర్షి http://bit.ly/Guruvu-3

గురువులు ఋషులు http://bit.ly/Guruvu-4

మన దేవతలు - ఋషులు -1 http://bit.ly/Guruvu-5

మహర్షుల చరిత్ర http://bit.ly/Guruvu-6

ఉద్దాలక మహర్షి http://bit.ly/Guruvu-7

కణ్వ మహర్షి http://bit.ly/Guruvu-8

జ్ఞానదేవుడు http://bit.ly/Guruvu-9

ఆచార్యుల చరిత్ర http://bit.ly/Guruvu-10

నవయోగులు http://bit.ly/Guruvu-11

మహా యోగులు http://bit.ly/Guruvu-12

ముగ్గురు గురువుల గురుచరిత్ర http://bit.ly/Guruvu-13

బాబాలు,స్వామీజీలు, గురుమహరాజ్ లు http://bit.ly/Guruvu-14

ద్రోణాచార్యులు http://bit.ly/Guruvu-15

ఒక యోగి ఆత్మ కథ http://bit.ly/Guruvu-16

అక్కల్కోట నివాసి శ్రీ స్వామి సమర్ధ http://bit.ly/Guruvu-17

కృష్ణాజీ జీవితం http://bit.ly/Guruvu-18

గణపతి సచ్చిదానంద-1 http://bit.ly/Guruvu-19

జగద్గురు విలాసం http://bit.ly/Guruvu-20

రామానుజ జీయరు స్వామి చరిత్ర http://bit.ly/Guruvu-21

దివ్య మాత http://bit.ly/Guruvu-22

నడిచే దేవుడు(చంద్రశేఖర పరమాచార్యులు) http://bit.ly/Guruvu-23

విద్యాప్రకాశానందగిరి స్వాముల జీవిత చరిత్ర http://bit.ly/Guruvu-24

మహా పురుషుడు http://bit.ly/Guruvu-25

భగవాన్ మహావీరుడు http://bit.ly/Guruvu-26

శ్రీరాఘవేంద్ర స్వామి చరిత్ర http://bit.ly/Guruvu-27

శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము http://bit.ly/Guruvu-28

హరనాథ భాగవతము http://bit.ly/Guruvu-29

అవతార్ మెహెర్ బాబా జీవిత చరిత్ర http://bit.ly/Guruvu-30

ఆంధ్ర యోగులు-7 http://bit.ly/Guruvu-31

సద్గురు మలయాళస్వామి http://bit.ly/Guruvu-32

చ్యవన మహర్షి http://bit.ly/Guruvu-33

మన మహోన్నత వారసత్వం http://bit.ly/Guruvu-34

గురు తత్త్వము http://bit.ly/Guruvu-35

గురు పూజా విధానం http://bit.ly/Guruvu-36

జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్య http://bit.ly/Guruvu-37

శంకరాచార్య చరిత్రము http://bit.ly/Guruvu-38

ఆదిశంకరాచార్య దివ్యచరితామృతము http://bit.ly/Guruvu-39

బాలల శ్రీరామకృష్ణ http://bit.ly/Guruvu-40

ధీర నరేంద్రుడు http://bit.ly/Guruvu-41

షిరిడి సాయిబాబా సచ్చరిత్రము http://bit.ly/Guruvu-42

హేమాడ్ పంత్ విరచిత శ్రీ సాయి సచ్చరిత్ర http://bit.ly/Guruvu-43

షిరిడి సాయిబాబా సచ్చరిత్రము http://bit.ly/Guruvu-44

షిర్డీ సాయి లీలామృతము http://bit.ly/Guruvu-45

సాయిబాబా చరిత్రము-నిత్య పారాయణ గ్రంధము http://bit.ly/Guruvu-46

షిర్డీ సాయి బాబా జీవిత సంగ్రహము http://bit.ly/Guruvu-47

సాయి లీలామృతము http://bit.ly/Guruvu-48

భగవాన్ రమణ మహర్షి http://bit.ly/Guruvu-49

గురు చరిత్ర http://bit.ly/Guruvu-50

శ్రీదత్త గురుచరిత్ర http://bit.ly/Guruvu-51

గురుమూర్తి నృసింహ సరస్వతి చరితము http://bit.ly/Guruvu-52

గురులీల http://bit.ly/Guruvu-53

నవనాధ చరిత్ర-నిత్య పారాయణ http://bit.ly/Guruvu-54

బొమ్మల యోగి వేమన http://bit.ly/Guruvu-55

వేమన http://bit.ly/Guruvu-56

బుద్ధ చరిత్రము http://bit.ly/Guruvu-57

బుద్ధ భగవానుడు http://bit.ly/Guruvu-58

బుద్ధ దర్శనం http://bit.ly/Guruvu-59

వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి సంపూర్ణ చరిత్ర http://bit.ly/Guruvu-60

పోతులూరి వీర బ్రహ్మము గారి జీవితం - రచన పరిశీలన http://bit.ly/Guruvu-61

స్వామి దయానంద http://bit.ly/Guruvu-62

సమర్ధ రామదాసు http://bit.ly/Guruvu-63

అరవిందులు http://bit.ly/Guruvu-64

కబీర్ http://bit.ly/Guruvu-65

గణపతి ముని చరిత్ర సంగ్రహము http://bit.ly/Guruvu-66

మహా తపస్వి-భగవాన్ శ్రీ వశిష్ట గణపతిముని చరిత్ర http://bit.ly/Guruvu-67

గురు గోవింద్ సింగ్ http://bit.ly/Guruvu-68

గురునానక్ http://bit.ly/Guruvu-69

స్వామి సమర్ధ అక్కల్ కోట మహారాజ్ http://bit.ly/Guruvu-70

స్వామి సిద్ధారూడ స్వామి చరిత్ర http://bit.ly/Guruvu-71

భగవాన్ శ్రీ బాల యోగీశ్వరుల చరిత్ర http://bit.ly/Guruvu-72

శ్రీనారాయణ గురు http://bit.ly/Guruvu-73

  *****ప్రవచనాలు ****
శ్రీ వ్యాస వైభవం - వ్యాస పౌర్ణమి - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013 http://bit.ly/Guruvu-VID-1

గురుపౌర్ణమి-వ్యాస పౌర్ణమి - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2013 http://bit.ly/Guruvu-VID-2

గురువు గొప్పదనం - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే  ప్రవచనం-2017 http://bit.ly/Guruvu-VID-3

గురు తత్త్వం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2017 http://bit.ly/Guruvu-VID-4

గురు వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2011 http://bit.ly/Guruvu-VID-5

గురువు - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2014 http://bit.ly/Guruvu-VID-6

గురుపరంపర - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం http://bit.ly/Guruvu-VID-7

గురు మహిమ - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2013 http://bit.ly/Guruvu-VID-8

గురు పూర్ణిమ - శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే ప్రవచనం-2015 http://bit.ly/Guruvu-VID-9

సప్త ఋషుల చరిత్ర - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2014 http://bit.ly/Guruvu-VID-10

దక్షిణామూర్తి వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012 http://bit.ly/Guruvu-VID-11

దక్షిణామూర్తి తత్త్వం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2017 http://bit.ly/Guruvu-VID-12

ఆదిశంకర విజయం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2016 http://bit.ly/Guruvu-VID-13

ఆదిశంకరాచార్య వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013 http://bit.ly/Guruvu-VID-14

జగద్గురు చరిత్ర - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2017 http://bit.ly/Guruvu-VID-15

ఆదిశంకరాచార్యులు - శ్రీ ప్రేమ్ సిద్ధార్ద్  గారిచే ప్రవచనం-2015 http://bit.ly/Guruvu-VID-16

చంద్రశేఖరమహాస్వామి ప్రస్థానం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2015 http://bit.ly/Guruvu-VID-17

శృంగేరి జగద్గురువుల వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013 http://bit.ly/Guruvu-VID-18

సాయి బాబా జీవిత చరిత్ర - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014 http://bit.ly/Guruvu-VID-19

శ్రద్ధ - సబూరి - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2015 http://bit.ly/Guruvu-VID-20

షిర్డి సాయి బాబా తత్వము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం http://bit.ly/Guruvu-VID-21

సాయి మహత్యం - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2014 http://bit.ly/Guruvu-VID-22

శ్రీ దత్తాత్రేయ గురుచరిత్ర - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014 http://bit.ly/Guruvu-VID-23

దత్తాత్రేయ చరిత్ర - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-చికాగో-2015 http://bit.ly/Guruvu-VID-24

శ్రీరామకృష్ణ కధామృతం - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే  ప్రవచనం-2017 http://bit.ly/Guruvu-VID-25

వివేకానంద జీవితం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2016 http://bit.ly/Guruvu-VID-26

వివేకానంద జీవిత చరిత్ర - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015 http://bit.ly/Guruvu-VID-27

గురువుల గొప్పదనం  తెలుసుకోవటానికి కావలిసిన పుస్తకాలు,ప్రవచనాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.

మరింత సమాచారం కోసం:
Website:  www.freegurukul.org
Facebook: www.fb.com/freegurukul
Telegram: http://t.me/freegurukul
Whatsapp: 9042020123

Friday, July 27, 2018

వందే వ్యాసం జగద్గురుం.




రాశియై వెలుగొందు ప్రాబల్కులను దీసి
.....విభజించి నాల్గుగా వెలయ జేసె
బ్రహ్మసూత్రములకు భాష్యము ప్రవచించి
.....బ్రహ్మవేత్తల కొక బాట వేసె
పంచమ వేదమౌ భారతమ్మును జేసి
.....గీతను బోధించి ప్రీతి గూర్చె
భాగవతాది సద్భారతీయ పురాణ
.....సంచయ కర్తయై జగతి మించె

నార్ష సంస్కృతి సంప్రదాయముల శిల్పి
చిచ్ఛనాతన సాహిత్య సృష్టికర్త
శక్తి పౌత్రు బారాశరు సత్యరతుని   
వ్యాసగురువును బాదరాయణుని దలతు.

Monday, July 23, 2018



వేదము లుద్ధరించి, గిరి వీపున మోసి, ధరన్ భరించి, ప్ర
హ్లాదుని గాచి, వామనుడవై, నృపులన్ వధియించి, దుష్ట లం
కాధిపు నుక్కడంచి, హలి నాని, వ్రజాధిప! డస్సి తీవు దు
గ్ధోదధి విశ్రమించు మిక కుండలిపై హరి! యోగనిద్రలో. 

Sunday, July 8, 2018

నుతులు

ఆహ్వానం
పుస్తకావిష్కరణ సభ
కంది శంకరయ్య సగర్వంగా సమర్పించు
జడ కందములు – మా కందములు
116 కవుల పద్య సంకలనం
ఆవిష్కర్త : శ్రీ ముద్దు రాజయ్య అవధాని గారు
సమీక్షకులు : ప్రముఖ కవులు శ్రీ నారుమంచి అనంతకృష్ణ గారు
---oOo---
తిరుప్పావై గజల్ మాలిక
రచయిత్రి : డాఉమాదేవి జంధ్యాల
ఆవిష్కర్త : గజల్ కవులు శ్రీ టి.వి.యస్రామకృష్ణ ఆచార్యులు గారు
సమీక్షకులు : ప్రముఖ కవులు శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు
---oOo---
వేదిక : వడ్డేపల్లి కమలమ్మ సీనియర్ సిటిజన్స్ భవనం,
పోస్టాఫీసు ప్రక్కనవివేకానంద నగర్కూకట్ పల్లిహైదరాబాదు.
తేదీ : 8 – 7 – 2018 (ఆదివారం)
సమయం : (కచ్చితంగాసా. 4 గంనుండి సా. 6 గంవరకు.
ఆహ్వానించువారు :
శంకరాభరణం ప్రచురణలు & జె.విపబ్లికేషన్స్, హైదరాబాదు.
ఫెడరేషన్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్కూకట్ పల్లి చాప్టర్ వారిసౌజన్యంతో

---------------------------------------------------------------------------------------------------------



అందములు వాణి కీ జడ
కందములు మనోజ్ఞమైన కైతల కివి సం
బంధములు కావ్య వన మా
కందములును తెలుగు తల్లి కచబంధము నౌ.

***

సంధ్యా కాలమునందు గోపికలతో సంరంభమై యుండ స
ద్వంద్యుండౌ హరి యాలకించెను తిరుప్పావై గజల్మాల సౌ
గంధ్యమ్ముం గొనియాడ వక్త,, లడిగెన్ కన్నయ్య వైనమ్ముకై,
"జంధ్యాలాన్వయ రత్న మ య్యుమ కృతిన్ శ్లాఘించుటల్, పాప దౌ
ర్గంధ్యమ్మున్ హరియించు నయ్యది" యనెన్ రాధమ్మ, వింటే? భళీ!


Friday, June 8, 2018

తొలకరిలో ఒక రైతు మనోభావం



చిటపట చినుకులు రాలెను
చటచట మను సూర్యు డింక చల్లగ మారున్
కటకట దీరును తనకని
అటమట పడు రైతు మదికి నానంద మయెన్.

తొలకరించెను నేడు పులకరించెను నేల
.....యేరువాక శుభమ్ము లిచ్చు నింక
కామందు నామాట కాదనబోడులే
.....కాడెడ్లతో పని కాని దికను
రామన్న కడ కేగి ట్రాక్టరు మాటాడి
.....దమ్మును జేయించ దక్కు ఫలము
విత్తులు మంచివి వెదకి పట్టిన చాలు
.....నారుమడిని బోసి నీరు పెడుదు

మెరక తోటకు గట్టితి నరక చాలు
దుక్కి దున్నితి పదనున జిక్కు తీరె
కూలివాండ్రకే నిజమైన కొరత నేడు
వేయ గట్లంక లాయెను పెద్ద బరువు.

నీరు లభించెడిన్, మురుగు నీటికి బోదెలు సిద్ధమాయె, వ్యా
పారియు నప్పు నిచ్చు, నిక వంచిన కాయము మేలు నాకు, స
ర్కా రిడ విత్తు లెర్వులను కాలము నందున, జాలు, సేమమౌ
కోరిన దాలి తాడు, కొని కోరిక దీర్తును పాప మామెకున్.

పదనున జల్లినాడ కద పైరుల, రాబడి చాలు కొంతలో
నదనున నూడ్చి యెర్వులను నాపయి చీడల మందు లిచ్చినన్
ముదమున నేలతల్లి యెద పొంగి సమృద్ధిగ నిచ్చు బంటలన్
సదయ కదా సతమ్ము తను సాకును రైతును కంటి రెప్పయై.

సైతుము కష్టనష్టముల స్థైర్యముతో శ్రమియించి, యేలికల్  
రైతుకు దన్నుగా నిలువ లక్ష్యము జేరుట కా దసాధ్యముల్,
ప్రీతిని గిట్టుబాటు ధర బెంచిన ఖర్చుకు తగ్గ యోగ్యమౌ 
రీతిని వచ్చు రాబడులు, లేములు బాయును చింత లారెడిన్. 





Thursday, June 7, 2018

జయ జగదీశ హరే

జయదేవుని గీత గోవిందం లో  వచ్చు పద్యం. ఈ పద్యంలో కవి దశావతార వర్ణన లో శ్రీ కృష్ణుని ఎందుకు వర్ణించలేదు అనే సందేహానికి జవాబు చెప్పుతూ  శ్రీ కృష్ణుడే పది రకాల విభిన్న అవతారములను ధరించెను అని ప్రతిపాదించుచున్నాడు.

శార్దూల విక్రీడిత వృత్తం

వేదానుద్ధరతే జగన్నివహతే భూగోళముద్బిభ్రతే, దైత్యం దారయతే బలిం ఛలయతే క్షత్రక్షయం కుర్వతే |
పౌలస్త్యం జయతే హలం కలయతే కారుణ్యమాతన్వతే,
మ్లేచ్ఛాన్ మూర్ఛయతే దశాకృతికృతే కృష్ణాయ తుభ్యం నమః || 5 ||

ప్రతి పదార్థం.
వేదాన్ = వేదములను
ఉద్ధరతే = ( సముద్రంలో మునిగి పోయిన వాటిని ) పైకి లేపుచున్న ( నీకు )
జగత్ = ప్రపంచమును
ని వహతే = చాలా చక్కగా మోయుచున్న ( నీకు )
భూగోళమ్ = గోళాకారము లో ఉన్న భూమిని
 ఉత్ బిభ్రతే = పైకి ఎత్తి పట్టి మోయుచున్న ( నీకు )
దైత్యం = ( హిరణ్య కశిపుడు అను ) రాక్షసుని
దారయతే = చీల్చి వేయుచున్న ( నీకు )
బలిం = బలి చక్రవర్తి ని
ఛలయతే = మోసగించుచున్న ( నీకు )
క్షత్ర క్షయం = క్షత్రియులైన రాజుల యొక్క నాశనమును
కుర్వతే = చేయుచున్న ( నీకు )
పౌలస్త్యం = పులస్త్య బ్రహ్మ కుమారుడైన పది తలల రావణుని
జయతే = జయించుచున్న ( నీకు )
హలం = నాగేలును
కలయతే = ధరించుచున్న ( నీకు )
కారుణ్యమ్ = దయను
ఆతన్వతే = అంతటా వ్యాపింప జేయుచున్న ( నీకు )
మ్లేచ్ఛాన్ = దుష్టులు దురాచారులు దుర్మతీయులు అగు విదేశీయులను
మూర్ఛయతే = మూర్ఛ వోవునట్లు చేయుచున్న ( నీకు )
దశ+ఆకృతి కృతే = పది రకాల విభిన్న ఆకారములను తయారు చేసి ధరించుచున్న (నీకు )
కృష్ణాయ = సమస్తమును నీ వైపు ఆకర్షించుకొను స్వభావము కలవాడవు అగుటచే కృష్ణుడు అని పిలువబడే
తుభ్యం = నీకు
నమః = ( నా ) నమస్కారమును
( కరోమి ) = చేయుచున్నాను.

భావము.
పూర్వం సోమకుడు అను రాక్షసుడు బ్రహ్మ నుండి వేదములను అపహరించి సముద్రంలో దాగి యుండగా నీవు చేప యొక్క రూపమును ధరించి వానిని సంహరించి వేదాలను తెచ్చి బ్రహ్మ దేవుని కి ఇచ్చి రక్షించితివి. గోళాకారము లో ఉన్న భూమి క్రిందికి పడి పోకుండా తాబేలు రూపంలో దానిని మోయుచున్నావు.  పూర్వం హిరణ్యాక్షుడను రాక్షసుడు భూమిని అపహరించి సముద్రంలో మునిగి దాగి ఉండగా నీవు పంది రూపము ధరించి వానిని సంహరించి భూమిని నీ కోరలతో పైకి ఎత్తి యథాస్థానము లో నిలిపితివి. హిరణ్యకశిపుడు తన కుమారుడు అగు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు అయినాడని వానిని చంపుటకు ప్రయత్నించుచుండగా విష్ణువు అంతటా ఉన్నాడు అని చెప్పిన ప్రహ్లాదుని మాటను నిజం చేయుటకు స్తంభం నుండి నరసింహ స్వామి వారి రూపమును ధరించి హిరణ్యకశిపుని సంహరించితివి. వామన రూపంలో బలి చక్రవర్తి నుండి మూడు అడుగులను దానము గా తీసుకుని ముల్లోకాలను ఆక్రమించి స్వర్గమును దేవతలకు రాజు అయిన ఇంద్రునికి తిరిగి ఇచ్చితివి.  జమదగ్ని మహర్షి కి పరశురాముడు గా పుట్టి దుష్టులు అయిన రాజులను అందరినీ నిశ్శేషముగా ఇరువది ఒక్క సారులు సంహరించితివి. దశరథ మహారాజుకి శ్రీ రాముడు గా జన్మించి పులస్త్య బ్రహ్మ కుమారుడైన పది తలల రావణుని వధించితివి. వాసుదేవ కృష్ణుని అన్న అయిన బలరాముడు గా జన్మించి నాగేలునే ఆయుధముగా చేపట్టితివి. మాయాదేవి శుద్ధోదనులకు సిద్ధార్థ గౌతముడు గా జన్మించి బుద్ధుడవై అహింసయే పరమ ధర్మమని బోధించితివి. కలి యుగం చివరలో కల్కి అవతారం ఎత్తి దుష్టులను సంహరించి ధర్మమును మరల స్థాపించెదవు. ఈ విధంగా పది రకాల విభిన్న అవతారములను ధరించెడు నీకు నేను నమస్కారములు చేయుచున్నాను.

....

వేదము లుద్ధరించి గిరి వీపున దాల్చి ధరన్ భరించి ప్ర
హ్లాదుని గాచి వామనుడవై బలి నొంచి నృపాళి ద్రుంచి లం
కాధిపతిన్ వధించి హలి నాని మహా కరుణా సముద్రమై   
మేదిని మ్లేచ్ఛులన్ దునిమి మించు దశాకృతు గృష్ణు గొల్చెదన్. 
   

Thursday, May 24, 2018

వృద్ధ విలాపం.

కండ్లు మసకలాయె పండ్లూడి పోయెను
తోలు ముడుతలాయె కాలు చెయ్యి
పట్టు దప్పిపోయి పనికి రానైతిని
కన్న వారికైన కర్మ మేమొ.

వయసున కన్న బిడ్డలకు వంతలు సుంతయు సోకకుండ నే
రయమున నన్ని కూర్చుచును రాబడి నెన్నక వారి భావి న
వ్యయ మగు రీతి దిద్దగ నహర్నిశలున్ శ్రమియించి నాడనే
వయసు డుగంగ భారమని వారలె తల్ప నిదేమి కర్మమో.

కాలకృత్యములురా తాళలే రమ్మన్న
..........కస్సున కొడు కొంటి కాల లేచు
మందివ్వరా కన్న మంచివాడ వటన్న
..........వినబోక మనుమడు వేడ్క జూచు
అపరాహ్ణ మాయె నే నాగలే కోడలా
..........అన్నము బెట్టన్న నాగ్రహించు
శీతోష్ణవాతముల్ చెడ్డ బాధాయెను
..........రక్షించు డని పిల్వ రా రొకరును

నేటి కొకసారి కూతురే యేగుదెంచి
నాదు దుస్థితి గని కడు బాధ నొంది
నేను కొరగాని దాన నైనాను నాన్న
యోర్చు కొనమని కన్నీరు గార్చి పోవు.

కాననివాని నూత గొని కానని వాడు చరించు భంగి నా
దానను వృద్ధ నూత  గొని దాపున కాలము వెళ్ళ దీయుటే
ప్రాణము లుండు దాక నిక, బాలలు ప్రోడలు పెద్ద గారొకో
హీనుని  కన్న హీనునిగ  నీ ముదిమిన్ నను జూడ మేలొకో.

శ్రవణుని రీతి పెద్దలను సాకగ గోరము వైనతేయులై
ప్రవిమల భక్తి జన్మ నిడు వారి ఋణమ్మును తీర్చ వేడ మే
యవమతులం  బొనర్చకను నాదరణమ్మున జూడ జాలు మీ
కవగత మౌను మా వ్యధలు కాలవశమ్మున కొంచె మోర్వరే.







Tuesday, May 8, 2018

praja padyam vizag

ప్రజ-పద్యం 

***************

దండమయా విఘ్నేశ్వర!
దండమయా శంభుపుత్ర! దండము వరదా!
దండమయా గౌరీసుత!
దండమయా నీకు నెపుడు దండము గణపా!

విద్యల నిమ్మా దయతో
పద్యంబుల జెప్పగల్గు పటుతర శక్తిన్
సద్యః స్ఫూర్తిని యిమ్మా
హృద్యంబయి బుధులు మెచ్చ నిమ్ముగ వాణీ!

పద్యమె మనదౌ లోకము
పద్యమె శ్వాసయును ధ్యాస పద్యమె స్వరమౌ
పద్యమె భావము రాగము
పద్యమె సర్వమును మనకు బంధువులారా.                                                                      1

ప్రజ-పద్య కవివరుల్ ప్రభవించు తరగలై
.....సమధికోత్సాహాన సందడించ
పఠియించు కవితల ప్రమద నాదమ్ములు
.....జలధిఘోషను మించి చెలగి రేగ
కవియశశ్చంద్రికల్ కమనీయ కాంతులై
.....ఫేనరాజిగ తళ్కు లీనుచుండ
పక్షపద్యావళు లక్షయానర్ఘంపు
.....రత్నాల ముత్యాల రాశులవగ

నేటి ప్రజ-పద్య వైశాఖ మేటి ఘటన
పొంగ పద్యాభిమానుల పురణమగుచు
చిన్నవోయెను సంద్రమ్ము తన్ను మించు
క్రొత్త  సింధువు జాడతో తత్తరమున.                                                                           2

పద్యము లేని తెన్గు వసి వాడు నటంచు తలంచి యీ ప్రజా
పద్య సదస్సు పూనికను పద్యము లల్లెడి వారి నందరన్
సద్యశ పాత్రులై పరగ సంఘటిత మ్మొనరించి యిచ్చట న్
హృద్య కవిత్వ రీతులను నింపుగ చాటె తెలుంగు నేలపై.                                       3

పదికాలమ్ములు పచ్చగా బ్రతికి పద్య మ్మీ ధరిత్రిన్ ప్రజా
హృదయాబ్జమ్ముల కాంతులీను రవియై యింపారగన్ సత్కవుల్
మదులన్  పూనుక జేరి మాధ్యమమునన్ మాన్యత్వ మేపారగా
పదులున్ వందలు వేలు పద్యములతో భాషాంగనన్ గొల్వగా.

ప్రజపద్యంపు మనోహరాంగణమునన్ భవ్యాత్ములౌ సత్కవుల్
స్వజయోత్సా హము మించ స్పర్థ బరిలో సామాజికాభ్యున్నతిన్
నిజభావమ్ముల నుంచి వ్రాసిరి కదా నిండైన పద్యావళుల్
ప్రజ లోహో యని మెచ్చురీతి విబుధుల్ బాగంచు కీర్తించగన్.                             4


పద్యామృతము ద్రావి వైనతేయుడు ధృతి
.....తోడను సుధ దెచ్చె తొల్లి వినవొ
పద్యోపదేశమై బాలధ్రువుడు దివ్య
.....పదమును పొందెను మొదలు వినవొ
పద్యస్మరణ చేత బాలప్రహ్లాదుండు
.....నాన్నను  కాదనె మున్ను వినవొ
పద్యమ్ముపాసించి పవనసూనుడు సంద్ర
.....మును దాటె లీలగా మునుపు వినవొ
బ్రహ్మ రుద్రాదు లందిరి పద్యమహిమ
శాశ్వత మ్మగు పదవుల సంతసమున
పద్య మహిమను వర్ణింప బ్రహ్మ కైన
నాదిశేషుని కైనను కాదు తరము.                                                                                 5

పద్య గంధము లలదుక 

Saturday, April 14, 2018

సత్తిబాబు




సౌమ్యుడు, సాధువర్తను, డసత్యము నేరని వాడు, ప్రజ్ఞలో
సామ్యము లేని జ్యోతిషుడు, సర్వ హితైషియు సత్తిబాబు తా
రమ్య వచస్కుడై సతము రాజిలి చప్పున నేగె మోక్షపుం
గమ్యము జేర బంధుల నగమ్యము పాలొనరించి అయ్యయో.

పిలుపు వచ్చిన వెంటనే వెడల వలెనె
ఖిన్నులై పెద్ద లందరు క్రింద నుండ?
చిన్నవాడవు న్యాయమే చేర పైకి?
రావె యొకసారి మాకయి బావమరది?

తప్పక ధర్మ మెన్నడును, దక్కిన దానికి తృప్తి జెందుచు,
న్నెప్పుడు చిత్త మందు జొరనీయక నీసు లసూయ లింతయున్,
ముప్పుగ మారినన్ సుఖము, మ్రొక్కుచు దేవుని సాగినట్టి నిన్
తప్పక దల్చుకొందు మయ తథ్యము నిత్యము సాధుజీవనా.

భగవంతు డిచ్చు సుగతుల
నొగి నిను తన అంకమునను నుంచుక మాల్మిన్
జగతిని పుట్టుచు గిట్టెడి
వగపుల సుడి బాపి నీకు పరము నొసంగున్.



Sunday, March 25, 2018

సీతాకల్యాణం



" ఎప్పుడు వచ్చునో యిటకు నెప్పుడు శంభుని వింటిఁ జూచునో
యెప్పుడు దాని నెక్కిడునొ యెప్పుడు నా కరమున్ గ్రహించునో
చప్పున సాగు కాలమ! దశాస్యుని పీడ బ్రచండ మాయెెఁెెె పె
న్ముప్పున నున్న సాధువుల బ్రోవ వలెన్ రఘురాముడే వెసన్.

ఇప్పుడు లంక కేగ వలె నేనిక నా రఘురామమూర్తి యా
గొప్ప సముద్రమున్ గడచి క్రూర దశానను ద్రుంచనౌ వెసన్
తప్పదు కొంత బాధ మరి దండన సేయగ రాక్షసేశ్వరు
న్నెప్పటి కైన "  నీ గతి దపించిన జానకి! నీకు మా నతుల్.

ఇంత దయాంబురాశి జగ మెల్ల సృజించెడి తల్లి సీతయే
సంతస మొప్ప  జీవ తతి జల్లగ జూచుచు జేయు పాలనన్
చింతల బాపి సర్వులకు శ్రేయము గూర్చు నిరంతరమ్ము తా
నంతము జేయు సర్వము ననంత తుదిన్  సెలవిచ్చి సృష్టికిన్.

***

తెల్లని ముత్యముల్ మెరయ దివ్య కరాబ్జములందు కెంపులై
యల్లన వోసె రామవిభు నౌదల జానకి,  రాలుచుండగా 
మల్లెల రీతి నొప్పె నవి, మా రఘు రాముని మేని శోభ రా
ణిల్లి సునీలకమ్ములుగ నెంతయు దీప్తుల మించె సేసలే.

***

మైథిలీ రామచంద్రుల మనువు వేళ
నిట్లు మురిపించు సేసలు హితవు గూర్చి
ధర్మపరులను గాచును ధరణి లోన
మంగళములను  గూర్చును మానవులకు.


Sunday, March 18, 2018

విళంబికి స్వాగతం.



కూయని గండుకోయిలలు కూయగ వేడ్కను గున్నమావిళుల్
వేయు జివుళ్ళు గాలియును వీచు సుగంధ పరీమళమ్ముతో
పూయును మల్లె మొల్లలును పొంకముగా కుసుమించు వేములున్
హాయిగ నాడి పాడ ధర కయ్యెడ వచ్చు వసంతు డర్మిలిన్.

క్రొత్త చివుళ్ళు మెక్కి సరి క్రొత్త గళమ్మున పాడ కోయిలల్
క్రొత్త వెలుంగు లీను సరి క్రొత్త యుగాదిని ధాత్రి నల్దిశల్
క్రొత్తకు తావు నిచ్చి తన గూటికి జేరగ ప్రాత మెల్లగా
క్రొత్త చివుళ్ళ సాగు పలు కోర్కెలు డెందము లందు తీవలై.

కాలమను దివ్య చక్రాన కదలె జూడు
మరొక ఆకు మున్ముందుకు మహిత గతిని
కాల రూపేశ్వరుని భక్తి కేలు మోడ్చి 
సలుప వలయు విళంబికి స్వాగతమ్ము.

***

కాయము మావి, మానవుని కర్మఫలాలు చివుళ్ళు, జీవుడే
కోయిల, లోని వాణి కుహు కూయను పాట, సుగంధ వీచియౌ
వాయువు శ్వాస, లోవెలుగు వంకల ద్యోతము, జీవభూమికన్
నేయము జూచువారలకు నిత్యవసంతము సత్యమే కదా. 

Wednesday, March 14, 2018

వల్లభేశుడు




వల్లభదేవి నంకమున వాటముగా నుపవిష్ట జేసి తా
నల్లన వామహస్తమున నర్మిలి దగ్గర జేర్చ స్వామి మో
మెల్ల ప్రసన్నతల్ విరియు నెల్ల జగమ్ముల నేలు జూడు డీ
చల్లని విఘ్ననాయకుడు సాగిలి మ్రొక్కి నుతింపరే జనుల్.


Friday, March 2, 2018

హోళికా పూర్ణిమ.



రమ్య బృందావనీ సీమ రమణు లలర
నారి నారికి నడుమ మురారి మెఱసె
జలజలా పారు యమునలో జలము లాగి
చూచి పులకించి తరియించెఁ జోద్యముగను.

నిండు పున్నమి రేయెండ వెండి వోలె
నిసుక తిన్నెల మెఱయింప మిసమిస నవి
గోపికల గూడి యాడెడు గోపబాలుఁ
గనుచు పులకించి తరియించెఁ దనివి దీర.

దట్టముగ నిల్చి యమున లోతట్టు పైన
జట్లు గట్టిన చీకటిచెట్లు గూడ
నింతులను గూడి క్రీడించు నిందు వదను
నరసి పులకించి తరియించె నప్పు డెలమి.

తరుణులఁ గూడి మాధవుఁడు తారలతో శశి వోలె రంగులన్
మురియుచు మానినీ హృదయముల్ విరులై వికసింప యామునీ
శరముల నిండు పున్నమిని సారసపత్రపు నీటిబిందువై
తిరిగిన వేళ లోకములు దీయని వేదన నొందె నెల్లెడన్.

Thursday, March 1, 2018

గోవర్ధనం.



గుణాతీతం పరం బ్రహ్మవ్యాపకం భూధరేశ్వరమ్
గోకులానంద దాతారం వందే గోవర్ధనం గిరిమ్.

గోలోకాధిపతిం కృష్ణ విగ్రహం పరమేశ్వరమ్
చతుష్పదార్థదం నిత్యం వందే గోవర్ధనం గిరిమ్.

నానాజన్మకృతం పాపం దహేత్తూలం హుతాశనః
కృష్ణభక్తి ప్రదం శశ్వద్వందే గోవర్ధనం గిరిమ్.

సదానందం సదావంద్యం సదా సర్వార్థ సాధనమ్
సాక్షిణo సకలాధారం వందే గోవర్ధనం గిరిమ్.

సురూపం స్వస్తికాసీనం సునాసాగ్రం కృతేక్షణమ్ 
ధ్యాయంతం కృష్ణ కృష్ణేతి వందే గోవర్ధనం గిరిమ్.

విశ్వరూపం ప్రజాధీశం వల్లవీ వల్లవప్రియమ్
విహ్వలప్రియ మాత్మానం వందే గోవర్ధనం గిరిమ్.

ఆనందకృత్సురాధీశకృత సంభార భోజనమ్
మహేంద్ర మదహన్తారం వందే గోవర్ధనం గిరిమ్.

కృష్ణలీలా రసావిష్టం కృష్ణాత్మానం కృపాకరమ్ 
కృష్ణానందప్రదం సాక్షాద్వందే గోవర్ధనం గిరిమ్.

గోవర్ధనాష్టక మిదం యఃపఠే ద్భక్తి సంయుతః 
తన్నేత్ర గోచరో యాతి కృష్ణో గోవర్ధనేశ్వరః .

ఇదం శ్రీమద్ఘనశ్యామ నందనస్య మహాత్మనః 
జ్ఞానినో జ్ఞానిరామస్య కృతి ర్విజయతేతరామ్.

Tuesday, February 27, 2018

ఉలూఖల బంధనం ..యోగ సాధన



యశోద పెద్ద కుండలోని పెరుగును పెద్ద కవ్వంతో చిలుకుతోంది.  ఆ సమయంలో బాలకృష్ణుడు అమ్మా ఆకలి పాలు కావాలి అంటూ వచ్చాడు. యశోదమ్మ ఉండమ్మా కన్నా పెరుగు చిలకడం అయిపోయాక పాలిస్తాను అన్నా వినకుండా మారాం చేసాడు కన్నయ్య.  సరే అని ఆవిడ చిలకడం అక్కడి కాపేసి బాలుణ్ణి ఒల్లో బెట్టుకుని పాలిస్తోంది. 

ఇంతలో వంటింట్లోంచి పొయ్య మీద పాలు పొంగి కాలిన వాసన వచ్చింది. చటుక్కున బాలకృష్ణుడిని క్రిందకు దించేసి వంటింట్లోకి పరిగెత్తింది యశోద. కన్నయ్యకు కోపం వచ్చేసింది. అమ్మ చిలుకుతున్న పెరుగు కుండను ఒక్క రాయితో కొట్టేడు. కుండ చిల్లు పడి పెరుగంతా నేల పాలయింది. అక్కడినుంచి ఎదురుకుండా ఉన్న ఇంట్లోకి దూరి ఉట్టి మీద ఉన్న తాజా వెన్నను తను తింటూ అక్కడ ఆడుకుంటున్న కోతి పిల్లలకు పెట్టడం మొదలెట్టాడు. 

వంటింట్లోంచి వచ్చిన గోపమ్మ బాల కన్నయ్య ఆగడాలు చూసి విసిగి వేసారి ఒక బెత్తం తీసుకుని వాణ్ని పట్టుకొని కొట్టబోయింది. కన్నయ్య బేల మొహం పెట్టేసి వద్దమ్మా కొట్టద్దమ్మా అంటూ భయాన్ని అభినయిస్తూ పరిగెట్టడం మొదలు పెట్టాడు. అమ్మకు దొరకకుండా బాలుడు, అలసిపోతూ ఆయాస పడుతూ బాలుణ్ణి ఎలాగైనా పట్టుకోవాలని  యశోద పరుగెడుతున్నారు. చివరికి అలసి పోయిన అమ్మను జూసి జాలిపడి కిష్టయ్య లొంగి పోయాడు.

వెంటనే యశోద జాలిపడి బెత్తాన్ని క్రింద పడేసి వాణ్ణి ఓ ముద్దు పెట్టుకొని నీ అల్లరి ఎక్కువై పోతోంది, నిన్ను కట్టేస్తేనే కాని నీ అల్లరి మానవు అంటూ ఒక పెద్ద తాడు తెచ్చి అక్కడ ఉన్న ఒక కర్ర రోలుకు బాలుణ్ణి కట్టేద్దామని దించింది. తాడుని రోలుకు ముడేసి బాలుడి బొజ్జ చుట్టూ తిప్పింది.  రెండు అంగుళాలు తక్కువైంది తాడు. వెంటనే ఇంకో తాడు తెచ్చి మొదటి తాడుకు జతచేసి బొజ్జ చుట్టూ తిప్పింది. మళ్ళా రెండు అంగుళాలు తక్కువైంది.  ఇంకో తాడు తెచ్చింది. జత చేసింది అదీ సరిపోలేదు. అలా ఇంట్లో తాళ్ళన్నీ అయిపోయాయి ఇంకేమీ లేవు అప్పుడు కృష్ణుడికి అమ్మ పడుతున్న పాట్లకు జాలేసి ఆఖరి తాడుతో తన బొజ్జకు సరిపెట్టేసుకున్నాడు. యశోద నీ కిదే శాస్తి అంటూ బాలుణ్ణి రోటికి కట్టేసి ఇంటి పనిలోకి వెళ్లి పోయింది.  ఇదే ఉలూఖల (ఱోలు) బంధనం.

ఇదంతా మనకు తెలిసిందే.

అయితే ఈ లీల వెనక అపురూపమైన యోగ రహస్యం దాగుందని, సాధకులైన యోగులు ఆ యోగాన్ని సాధన చేస్తూ ఆనందాన్ని పొందుతూ సమాధిలోకి వెళ్ళిపోతూ ఉంటారని, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇంకా ఇలా చెప్పేరు.

పరమాత్ముడు మన చుట్టూనే తిరుగుతూ తన ఉనికిని తెలుసుకోమని మనను హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ సరైన సాధన లేక మనం వినం ముందు యశోద కృష్ణుడి ఆకలిని పట్టించుకోనట్లు. ఆఖరికి అదృష్ట వశాత్తు సాధనకు దొరుకుతాడు. అంతలో సంసార వాసనలు ఆయన్ని ప్రక్కకు తోసేస్తాయి. యశోద పొయ్యి మీద పాలకోసం బాలుణ్ణి దించేసి లోపలి పరిగెట్టినట్లు. ఆ స్థితిలో భవ బంధాలను అన్నిటినీ ఒక్కొక్కటీ ఏకం చేసి పరమాత్మ వైపు చూడటం మొదలెట్టాలి యశోద ఇంట్లో తాళ్ళు అన్నీ ఒకటిగా చేసినట్లు.  అప్పుడు ద్వంద్వాలను (అంటే అహంకార మమకారములు, సుఖ దుఃఖములు వంటి వాటిని) కూడా విడచి పెట్టాలి. అవే యశోదను తిప్పలు పెట్టిన రెండంగుళాలు. ఆ క్రమంలో యశోదలా తపించిపోవాలి విశ్వగర్భుడిని హృదయకుహరంలో కట్టి పడెయ్యడానికి. దొరకకేం చేస్తాడు విశ్వాత్మకుడు?
   
పై భావానికి నా పద్య రూపం:

సాధనతో సమాధి గొని సర్వమయు న్నెదలోన నిల్పినన్,
కాదని యైహలౌకికపు గాటపు వాసన లీశు జార్చెడిన్
ఛేదన చేసి బంధముల చిట్లని పట్టున భక్తి రజ్జుచే     
మాధవు గట్టగా వలయు, మాయని ద్వంద్వములన్ త్యజించి, దా
మోదరు డంత బట్టువడు మోదముతోడను, నందనందనుం
డాదర మొప్ప ఱోటికడ నమ్మకు జిక్కిన రీతి, గట్టిగా.

*****

( శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు రాజమహేంద్రవరం లో 42 రోజుల శ్రీమద్భాగవత ప్రవచనం చేస్తున్నారు ఈ నెల 2వ తేదీ నుంచి.  ఫేస్ బుక్ లో " బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు
" అనే పేజీ లో ప్రతి రోజు సాయంత్రం 6.30 గం.నుంచి లైవ్ లో చూడవచ్చును ఆ ప్రవచనాన్ని. మార్చి నెల 15 వ తేదీ వరకు)

శ్రీదేవికి నివాళి

అతిలోక సుందరి క్షితి వీడి నందన
....వని కేగె చూపుల తనుప సురల
వాసంత కోకిల స్వర్గ సీమను పాడ
....వలస పోయెను వీడి వసుధ వనుల 
తెర పైన దేవత పరలోక వేదిక
....నలరించ పయనించె నిలను విడచి
కార్తీక దీపమ్ము వర్తిని గోల్పోయి
....దీప్తుల మాసెను తిమిర మంట

వృద్ధయై కుమిలె పదహారేళ్ళ వయసు
వాడె వజ్రాయుధము వీడి వాడి వేడి
శిక్ష అభిమాన తతికి క్షణక్షణమ్ము
బావురనె చిత్రసీమ శ్రీదేవి లేక.

Wednesday, February 21, 2018

మాతృభాష కు వందనం.

మాతృభాషను నీవు మాటాడ వోవునే
.....మానమర్యాదలు హీన మతివె?
తల్లిపల్కున నీవు సల్లపనము లాడ
.....పరు వేమి మాయునే భ్రష్ట మతివె?
అమ్మబాసను నీవు హాయిగా భాషింప
.....అవమాన మగునేమి యల్ప మతివె?
తల్లిదండ్రుల వాణి తలపోయ నేర్వవు
.....కొంచెమౌనా యేమి కొంచె మతివె?

కోకిలమ్మ గూట కూసెడు కాకివే
నీదు భాష విడచి నిజము మరచి
పరుల బాస వెంట పరువెత్తి పోదువు
జడుడ నిన్ను గన్న కడుపు చేటు.

***
దువ్వూరి వి యన్ సుబ్బారావు.  

Monday, January 15, 2018

మకర సంక్రమణము

కుంటి చోదకు డేడు గుర్రాల పూన్ చిన
.....రథమును నడుపగ కదలు వాడు
నొంటి చక్రపు తేరు కంటి కానని రీతి
.....నొడుపుగ పరుగిడ నురుకు వాడు
నంటియు నంటక నఖిలాండముల పైన
.....ప్రభవిల్లు మార్గాన బరచు వాడు
నలు పన్న దెరుగక నిలకు రేబవళుల
.....నొనరించి నిత్యము తనియు వాడు


కాంతు లీనుచు పద్మినీ కాంతు డెలమి
నుత్తరాయణ దీధితు లుర్వి దనర
మకర నికరమునకు మంగళకరముగను
చకచకా నేగు తరుణ మీ చంక్రమణము.