padyam-hrudyam

kavitvam

Thursday, December 23, 2010

గణేశ స్తుతి

















చేత వేడి కుడుము చెన్నొందు బొజ్జయు
ఎలుక వాహనమ్ము ఏన్గు ముఖము
పెద్ద చెవులు మెరయు పెరికిన దంతమ్ము
విఘ్నరాజ నీకు వేయి నతులు.

********************************

కొల్తును నే గణ నాథుని
కొల్తును నే గౌరి సుతుని కొల్తును దంతున్
కొల్తును నే విఘ్నేశ్వరు
కొల్తును నే శుభములీయ కూర్మిని సతమున్.

Friday, November 5, 2010

దీపావళి

దివ్వెల కాంతులు, వెల్గుల భ్రాంతులు, తేజము నిండగ నెల్లెడలన్
రివ్వున జువ్వలు, రవ్వల రువ్వులు, రిక్కలు పొంగగ నింగి పయిన్
దవ్వుల, దాపుల, సవ్వడి, సందడి దద్దరిలంగను నల్దిశలున్
నవ్వుల పువ్వులు, తియ్యని బువ్వలు నల్వురు మెచ్చగ రమ్యముగన్!