padyam-hrudyam

kavitvam

Monday, February 28, 2011

రామ తారక శతకము 8

36 . ఈషణ త్రయంబు లీక్షించి మదిలోన - మేలు మేలని విడచు మేటి యొకడు
సద్గుణంబులు తనకు సామాన్యమని తలచి - స్వస్థుడై యుండు నా సాధుడొకడు
అష్ట భోగంబుల నాభాసమని యెంచి - తుచ్ఛ ముగా జూచు ధుర్యు డొకడు
విషయంబులను బట్టి విహరింప జాలక - సూటి దప్పక జూచు సుముఖు డొకడు

వనము పురమని కోరక వాన యనక - ఎండ మంచుల టంచును యెరుక లేక
నుండు నీ రీతి నవధూత యుర్వి లోన - రామ! తారక! దశరథ రాజ తనయ!

37 . జన్మ మెత్తిన ఫలము జగదీశ్వరుని యొక్క - పలుమారు గుణ కథల్ పలుకనైతి
బుద్ధి కలిగిన ఫలము బుధుల చెంతను జేరి - హరి జేరు మార్గంబు నడుగ నైతి
కాయంబు గల ఫలము కర్మ సంసారినై - నీయందు చిత్తంబు నిలుప నైతి
బహు వత్సరంబులు బ్రతికిన బ్రతుకుకు - సకల తీర్థా చరణ సలుప నైతి

బాల్య కౌమార యవ్వన భ్రాంతి జేత - వ్యర్థ మాయెను కాలంబు వేదవేద్య!
ద్రోహి, శరణంటి నను గావ దొడ్డ ఘనత - రామ! తారక! దశరథ రాజ తనయ!

38 . సంభ్ర మించిన ఫలము సంసార రహితుడై - భజియించి నిశ్చల భక్తుడగుచు
భక్తి వాత్సల్యంబు భావంబులో నెరిగి - యటు మీద సంధాన మమర జేయు
సంధాన మార్గంబు సతమని నెర నమ్మి - యమృత రూపుండవై యలరు చుండు
....................................................................................................................

నడ చదువు వల్ల ఫలమిది నరుల కెల్ల - కోటి విద్యలు నవి యెల్ల కూటి కొరకు
కొండ భేదించి ఎలుకను గొనగ వలెనె - రామ! తారక! దశరథ రాజ తనయ!

39 . మధు శర్క రాయుత దధి ఘృతంబుల కంటె - రామ నామామృత రసము తీపు
పనస జంబూ ద్రాక్ష ఫల రసంబుల కంటె - రామ నామామృత రసము తీపు
కదళికా మకరంద ఖర్జూరముల కంటె - రామ నామామృత రసము తీపు
నవ సుధా పరమాన్న నవనీతముల కంటె - రామ నామామృత రసము తీపు

రామ నామంబునకు నేమి సాటి రాదు - రామ నామంబు సేవించి నారదుండు
బ్రహ్మ ఋషి యయ్యె నిహమందు ఫలము నొందె - రామ! తారక! దశరథ రాజ తనయ!

40 . శ్రీ మంతుడగు రామ చంద్రుని దలచితే - నరచేత మోక్షంబు నందినట్లు
జయ రామ నామంబు జపము గావించితే - జీవాత్మకుడు ముక్తి జెంది నట్లు
కాకుథ్స తిలకుని కన్నుల జూచితే - బహు పేదలకు ధనం బిచ్చినట్లు
శ్రీ రామ చంద్రుని సేవింప గల్గిన - నష్ట భోగంబులు నమరినట్లు

కరుణ గలిగిన సద్గురువు గలిగి నట్లు - జీవ నదులందు స్నానంబు జేసినట్లు
కుటిలములు లేక జ్ఞానంబు కుదిరినట్లు - రామ! తారక! దశరథ రాజ తనయ!

Sunday, February 27, 2011

రామ తారక శతకము 7

31 . జపము దేవార్చన సలపని జన్మంబు - తామసంబున జేయు తపసి తపము
పతిభక్తి లేనట్టి పడతుల వ్రతములు - యజమాని గూర్చని యాగములును
గురుభక్తి లేనట్టి గూఢ మంత్రంబులు - విత్త మార్జించెడి వేదములును
కాసులార్జిన్చెడి కన్యకా దానంబు - ధనము వాటున గొన్న ధర్మములును

ఎంచి చూచిన నవి యేల నేమి ఫలము - ఫలము దెలియంగ నేరక పాటి దప్పి
నరసి నరకంబు కేగుట నయమె నీకు - రామ! తారక! దశరథ రాజ తనయ!

32 . అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక! నీవు - ముచికుందునకు మోక్ష మిచ్చి నావు
ఆకుచేలుని చేతి యటుకుల భక్షించి - ఎడతెగని సంపద లిచ్చినావు
శరణాగత త్రాణ! శబరి తెచ్చిన పండ్లు - అంచితంబుగ నార గించినావు
వేద వేదాంగ! యా విదురుని యన్నంబు - కోరి వేడుకతోడ గుడిచినావు

జానకీ నాథ మీ దాస జనుల యిండ్ల - తులసి దళమైన మీ జిహ్వ తృప్తి నొందు
యచ్యుతానంత ! గోవింద!హరి! ముకుంద! - రామ! తారక! దశరథ రాజ తనయ!

33 . ఆశ్రమ ధర్మ మందాస నొందని వాడు - సత్య మార్గం బెపుడు చనెడు వాడు
శ్రీ రాము నర్చించి సిరియు గోరని వాడు - మమకార బుద్ధిని మాను వాడు
లబ్ధ పదార్థంబు లాభంబు యనువాడు - పరులకు హితముగా బలుకు వాడు
..........................................................................................................

యోగ సంసారికీ గుణ మెంచ వలయు - గాక కడు భక్తి వేషంబు గణన చేయ
వలదు సంసార బద్ధుల వాంఛ గాక - రామ! తారక! దశరథ రాజ తనయ!

34 . విష్ణు ప్రసంగముల్ వలనొప్ప విను వాడు - పులకామ్కురమ్ములు పొడము వాడు
హరి గానగా మది నాస్థ గల్గిన వాడు - సకలోప చారముల్ సల్పు వాడు
అతని కర్పించి తానను భవించెడి వాడు - సుతుని కైవడి నర్థి జూచు వాడు
సాధుల మాన్యుల సౌఖ్య పెట్టెడి వాడు - మదిలోన శ్రీరామ మనెడి వాడు

పుణ్య పురుషుండు భక్తుండు పూజితుండు - ధర్మ మార్గుండు ధన్యుండు ధార్మికుండు
కలడు వేయింటి కొక్కడు కడను లేడు - రామ! తారక! దశరథ రాజ తనయ!

35 . తల్లి దండ్రుల గన్న తాత ముత్తాతలు - తరలి పోయిన వార్త దాను తెలిసి
జీవించు పెక్కండ్రు జీవ కోట్లను జూచి - జనన మరణాదుల జాడలెరిగి
సర్వ కాలము నిల్చు సంపద లుండని - విభవంపు రాజుల వింత జూచి
సారంబు లేనట్టి పాప సంసారమ్ము - యాతనల చేత తానను భవించి

కనియు గానంగ జాలరు కర్మ వశులు - అస్థిరంబెల్ల స్థిరమన కవని బుధులు
సన్నుతింతురు మిమ్మును సంతతంబు - రామ! తారక! దశరథ రాజ తనయ!

Saturday, February 26, 2011

రామ తారక శతకము 6

26 . దేహంబు విడచెడు దినము తా నెరుగడు - కర్మంబు వచ్చుట గాన లేడు
మూడవస్థల లోన మునిగి లేవగ లేడు - ఆర్వురు శత్రుల నణచ లేడు
మగువల రతులందు మమత మానగ లేడు - వాడు వీడని పల్కు వదల లేడు
అభిమాన రహితుడై యాస లుడుగగ లేడు - ఇంచుక హరి మాయ నెరుగ లేడు

నరుడు బ్రహ్మంబు తానగుట నరయ లేక - బుద్ధి హీనుల కడ కేగి పొందు జేసి
యుదర భరణంబు గావించు నుర్వి లోన - రామ! తారక! దశరథ తనయ!

27 . నీతి నెరుంగవు నిందకు నోడవు - చంచలం బెప్పుడు చెడ్డ గుణము
వాయు వేగము కంటె వడి గల వాడవై - పారెద వెప్పుడు పడుచు దనము
చేరు వేరొక్కటి జీరుట యొక్కటి - చేరువ కర్మంబు చెప్ప లేవు
పుత్ర మిత్రాదులె పుణ్య లోకంబని - సద్గతి నెరుగవు జడుడ వగుచు

మనసు యీ రీతి వర్తించు మంద మతిని - నరసి నగరంబు కేగుట నయమె నీకు
ముందు తెలియక విహరించి మోస పోక - రామ! తారక! దశరథ తనయ!

28 . యమునిచే బాధల నెట్లోర్చగా వచ్చు - నగ్ని కంబంబున కంట గట్ట
పాపంబు నా నోట పల్కించి యొప్పించు - చిత్రగుప్తుని పిల్చి చెప్పుమనుచు
తప్పక నావారు తప్పులెన్నియొ జెప్ప - నుగ్రుడై దూతల కొప్పగించి
బాధించు వేళ నా బ్రదుకేలనో యని - యార్వగ నెవ్వరు నచట రారు

తెలిసి వర్తించు మిప్పుడే తెలివి గలిగి - అనుదినంబును శ్రీ రాము నాశ్రయించి
మ్రొక్కి సేవించి కనుగొను మోక్ష పదవి - రామ! తారక! దశరథ తనయ!

29 . మరిమరి నాయొక్క మర్మ కర్మంబులు - ప్రఖ్యాతి జేసెద పాప హరణ
ధర శీలుడైనట్టి ధన్వంత్రి దొరికితే - దేహ రోగంబెల్ల దెలిసి నట్లు
గురు శిష్యు డైనట్టి గురువును కనుగొని - ముక్తి మార్గము కొరకు మ్రొక్కినట్లు
రక్షింప దలచిన రాజును గనుగొని - యార్తుడై యన్నంబు నడిగినట్లు

విన్నవించెద నా వార్త విమల చరిత - అగణి తంబైన కలుషంబు లడగ జేసి
నిర్మలాత్మునిగా జేయు నిగమ వేద్య - రామ! తారక! దశరథ తనయ!

30 . ఎన్ని జన్మంబుల నెత్తితి నేనని - తప్పుగా బలుకునా తపసి యొకడు
శత్రుల మిత్రుల సమముగా జూచుచు - శ్రీ హరి నమ్మిన సిద్దు డొకడు
సకలేన్ద్రియంబుల సాధకంబున బట్టి - ముక్తుడై యుండునా మునియు నొకడు
.............................................................................................................

బ్రహ్మ యీ రీతి వాడని పలుక వచ్చు - గాక యితరులు నేర్తురే కనుగొనంగ
సకల వేదాంతముల గల్గు సార మిదియ - రామ! తారక! దశరథ తనయ!

Friday, February 25, 2011

రామ తారక శతకము 5

21 . ఈప్సితార్థములిచ్చి యిహమందు రక్షించి - పరమందు మీ సేవ ప్రాప్తి జేసి
అగణితంబైన నీ ఆశ్రయస్తుల లోన - గణుతించి గ్రక్కున గార వించి
భక్తుని కృప జేసి పరిపూర్ణ ముగనుంచి - నిజముగా దాసుల నిర్వహించి
ప్రియముతో పిలిచితే ప్రేమతో పొడసూపి - యభయ హస్తము నిచ్చి యాదరించి

ఒరుల యాచించి సేవింప నోర్వ లేక - వెదకి కనుగొంటి నా పాలి వేల్పువనుచు
మగుడ జన్మంబు లేకుండ మందు గోరి - రామ! తారక! దశరథ రాజ తనయ!

22 . మూఢుల రక్షించి మోక్ష మిచ్చుట కీర్తి - ద్రోహుల గాచుట దొడ్డ కీర్తి
పాప కర్ముల కెల్ల పదమిచ్చుటది కీర్తి - ఆత్మ సంరక్షణ యమిత కీర్తి
నీ వాడ నని యంటె నిర్వహించుట కీర్తి - ప్రేమ దీనుల బ్రోవ పెద్ద కీర్తి
సామాన్య జీవుల సంతరించుట కీర్తి - మునుల రక్షించుట ఘనత కీర్తి

పెద్దలైనట్టి సంసార పామరులకు - సరస సాయుజ్య పదమిచ్చు టంతె గాక
యనుచు సేవింతు రీరీతి నను దినంబు - రామ! తారక! దశరథ రాజ తనయ!

23 . జంతు జాలమునందు జన్మించి కొన్నాళ్ళు - యితర జన్మమ్బులు ఎత్తి ఎత్తి
మానవ దేహంబు మరిమరి ఎత్తుచు - నన్ని వర్ణంబుల నరసి చూచి
ఏ పుణ్య వశమునో యీ జన్మ మెత్తితి - విప్ర దేహమ్బిపుడు విమల చరిత!
ఈ జన్మమందైన నిపుడు నీ సేవను - మానక జేసెద మౌని వంద్య!

వేద శాస్త్రములన్నియు వెదకి జూచి - తప్పు గాకుండ నడువ నా తరము కాదు
శరణు జొచ్చితి నిక నాకు శంక ఏమి - రామ! తారక! దశరథ రాజ తనయ!

24 . దశరథాత్మజ నీకు దండంబు దండంబు - వైదేహ పతి నీకు వందనంబు
కౌసల్య సుత నీకు కల్గు కల్యాణంబు - జానకీ పతి నీకు జయము జయము
అమరవందిత నీకు నాయు రారోగ్యముల్ - శర ధనుర్వర్థ నీ శరణు శరణు
నీల మేఘ శ్యామ నీకు సాష్టాంగంబు - సుర రాజ పూజిత శుభము శుభము

అనుచు వర్ణించి భజియించి యాత్మ దలచి - నిలిచి సన్మార్గ వంతుడు నిన్నెరుంగు
నతని కను గొన్న ఫల మెన్న నా వశం బె - రామ! తారక! దశరథ రాజ తనయ!

25 . భాను వంశము నందు ప్రభుడవై జన్మించి - యఖిల విద్యల నెల్ల నభ్యసించి
తాటకి మర్దించి తపసి యాగము గాచి - శిలకు శాపము బాపి స్త్రీని జేసి
శివుని చాపము ద్రుంచి సీతను పెండ్లాడి - పరశు రాముని త్రాణ భంగ పరచి
తండ్రి వాక్యము గొరకు తమ్ముని తో గూడి - వైదేహి తోడను వనము కేగి
ఖర దూష ణాదుల ఖండించి రాక్షస - మారీచ మృగమును మడియ జేసి
లంకకు రాజైన రావణాసురుడు నీ - సతిని గొని పోవంగ సంభ్ర ముడిగి
సుగ్రీవు గనుగొని సుముఖు డైయప్పుడు - వాలిని వధియించి వరుస తోడ
రాజ్య మాతనికిచ్చి రాజుగా చేపట్టి - కిష్కింధ నేలించి కీర్తి వడసి

వాయు సుతు జేత జానకీ వార్త దెలిసి - తరలి సేతువు బంధించి త్వరను దాటి
రావణానుజు కభయంబు రయము నొసగి - ఘోర రణమందు రావణు గూల నేసి
యతని తమ్ముని రాజుగా నమర జేసి - సతిని చేకొని సురలెల్ల సన్నుతింప
రాజ్య మేలిత యోధ్యకు రాజు వగుచు - రామ! తారక! దశరథ రాజ తనయ!

Thursday, February 24, 2011

రామ తారక శతకము 4

16 . నిన్నాశ్రయించితి నీవాడ నని యంటి - పాహిమాం కోదండ పాణి యంటి
రఘుకుల దీపక రక్షించు మని యంటి - కరుణ సాగర నన్ను గావుమంటి
దైవము నీవని దిక్కు నీవని యంటి - దుష్కృత కర్మముల్ ద్రుంచు మంటి
అఖిల లోకారాధ్య యభయ మిమ్మని యంటి - నీప్సితార్థము లిప్పు డియ్యమంటి

అడుగ నింతైన నితరుల నమర వంద్య - పరుల యాచింప నాకేల పరమ పురుష
దాతలకు నెల్ల దాతవు దైవ రాయ - రామ! తారక! దశరథ రాజ తనయ!

17 . ఎచ్చోట హరికథ లచ్చోట సిద్ధించు - గంగాది తీర్థముల్ గన్న ఫలము
లెచ్చోట సత్యంబు నచ్చోట నిత్యంబు - లక్ష్మీ సరస్వతు లమరి యుందు
రెచ్చోట ధర్మంబు నచ్చోట దైవంబు - జయము లెల్లప్పుడు జరుగు చుండు
ఎచ్చోట భక్తుండు నచ్చోట హరియుండు - నిధుల ఫలంబిచ్చు నింట నుండు

నీదు భక్తుల గుణములు నిర్ణయింప - ఫలము భాగ్యము లింతని ప్రస్తుతింప
వశమె ఎవ్వరికైనను వసుధ లోన - రామ! తారక! దశరథ రాజ తనయ!

18 . పదివేల గోవుల ప్రతి దినం బొసగిన - పంచ భక్ష్యాన్నముల్ పరగ నిడిన
గ్రహణ పర్వములందు గజ దాన మొసగిన - నశ్వ దానంబులు నమిత మైన
పెక్కు యాగంబులు ప్రేమతో జేసిన - యితర ధర్మంబులు నెన్ని యైన
...................................................................................................

తుల్య మగు నట్టి మీ నామ స్తుత్య మునకు - హస్తి మశ కాంతరము సాటి యౌను గాక
యింత ఫలమని వర్ణింప నెవ్వడోపు - రామ! తారక! దశరథ రాజ తనయ!

19 . నా పాలి దైవమా నా మనంబున నిన్ను - దలచి సేవించెద తండ్రి వనుచు
నా మూలధనమని నమ్మియుప్పొంగుచు - దండ మర్పించెద దాత వనుచు
నా తోడు నీవని నవ్వుచు గేరుచు - రంజిల్లు చుండెద రాజు వనుచు
నాకును గురుడవై నా తప్పులెన్నక - కాచి రక్షించును కర్త వనుచు

పెంచి పోషించి కాపాడ పెద్ద వనుచు - పుత్ర వాత్సల్య తండ్రికి పుట్టి నట్లు
కృపకు పాత్రునిగా జేసుకొనుము దేవ - రామ! తారక! దశరథ రాజ తనయ!

20 . బహు జన్మముల నెత్తి బాధ నొందగ నేల - పరమ పురుషుని గొల్చి బ్రతుక వలయు
శేష వాసనలచే చిక్కి వగవగ నేల - శ్రీ నివాసుని పూజ సేయవలయు
విషయ భోగంబుల విర్ర వీగగ నేల - విష్ణు చరిత్రంబు వినగ వలయు
అస్మదాదుల కొరకు యనృత మాడగ నేల - హరి నామ కీర్తన లాడ వలయు

తనువు తథ్యంబు గాదని తత్త్వ విదులు - సంతత ధ్యానులై మిమ్ము సంస్మరించి
నిన్ను సేవింపు చుందురు నీరజాక్ష - రామ! తారక! దశరథ రాజ తనయ!

Wednesday, February 23, 2011

రామ తారక శతకము 3

11. ఆవేళ యమునిచే నాపద బడలేక - జడిసి యిపుడే మిమ్ము తలచు కొంటి
నపరాధి నపరాధి నపరాధి నని మ్రొక్కి - యాశ్ర యించితి మిమ్ము నప్రమేయ!
శరణన్న మాత్రాన శంకలన్నియు మాని - భయ నివారణ మాయె భజన చేత!
ఇంత సులభుడవంచు నెరిగితే యిన్నాళ్ళు - యేమరి యుందునా యెరుగ నైతి

తెలిసె మీ కృప నాకెల్ల తేట పడను - మర్మ మెరిగితి నీ కీర్తి మహిమ వింటి
గట్టు దాటితి నీవె నా గతివి యంటి - రామ! తారక! దశరథ రాజ తనయ!

12 . వరము దప్పక ధర్మ వర్తన వర్తించి - వేదోక్త కర్మముల్ వెదకి జూచి
శిష్ట శీలుర యొక్క శిష్యత్వమును జేసి - సత్వ ప్రధానంబు సంగ్రహించి
సాంద్ర దయా గురు స్వామిని మదినుంచి - హరి జేరు మార్గంబు నరయ నడిగి
వారిచే బడసిన వర మంత్ర రాజంబు - పరి చిత్తుడను గాక పఠన జేసి

మరచి కామ్యము గోరక మర్మ మెల్ల - హరికి నర్పించి నట్టి యా యధిక పుణ్య
మరసి రక్షించు మదియెల్ల నంతె గాక - రామ! తారక! దశరథ రాజ తనయ!

13 . హరి నామ కీర్తన లానాడె జేసితే - వేదన త్రయము నన్ వీడి యుండు
నీక్షించి మదిలోన యిన కులోత్తమ యన్న - నీషణ త్రయములు నీడ్వ కుండు
దశరధాత్మజు గూర్చి ధ్యానంబు జేసితే - దారిద్ర్య దోషంబు తొలగి యుండు
జానకీ పతి మంత్ర జపమును జేసితే - జన్మ కర్మంబులు జారి యుండు

భక్తి పుష్పంబు పక్వమై పండు గాక - అమిత శాలంబు లిన్నాళ్ళు హరణ మాయె
పాతకుడ నన్ను రక్షించు పరమ పురుష - రామ! తారక! దశరథ రాజ తనయ!

14 . మరిమరి జిహ్వకు మాధుర్య మై యుండు - మనసు మీ స్మరణను మరగి యుండు
వీనులు మీ కథ విన వేడ్కలై యుండు - చూడ్కులు మీ రూపు జూచు చుండు
బుద్ధి మీ తత్వము పొంద గోరు చునుండు - పూజింప హస్తముల్ పొంగు చుండు
కామ్యంబు మోక్షంబు కాంక్ష జేయుచు నుండు - భక్తి యీ రీతిని ప్రబలు చుండు

ఇతర నామంబు పలుకను యింపు గాదు - సతతము న్నీదు నామంబు సంస్తుతింప
హర్ష మానంద మగుచుండు నను దినంబు - రామ! తారక! దశరథ రాజ తనయ!

15 . నీ ప్రభావంబులు నిగమంబులే కాని - పలికి వర్తింప నా బ్రహ్మ వశమె
నీ నామ మధు రుచి నీల కంఠుడె గాని - వేయి కన్నులు గల వేల్పు వశమె
నీ పాద నఖముచే నిర్భిన్న మైనట్టి - బ్రహ్మాండ కటహ మెవ్వరుల వశమె
నీ కీర్తి గొనియాడ నిశ్చలు రైనట్టి - నారదాదులె గాని నరుల వశమె

ఎన్న జాలని తారల నెన్న వచ్చు - జలధి కణముల గణుతించి చెప్పవచ్చు
పరమ తారక మంత్రంబు పలుక వశమె - రామ! తారక! దశరథ రాజ తనయ!

Tuesday, February 22, 2011

రామ తారక శతకము 2

6 . నీ నామమే కదా నిఖిల శాస్త్రము లెన్న - పరలోక ప్రాప్తికి ప్రాభవంబు!
నీ నామమే కదా నిఖిల జీవుల కెల్ల - నఖిల వైభవముల కాలయంబు!
నీ నామమే కదా నిర్మలాత్ముల జేయ - నౌను జీవుల కెల్ల నౌషధంబు!
నీ నామమే కదా నిచ్చలు భక్తుల - కార్య సిద్ధికి నాది కారణంబు!

దునిమి భేదించు దారిద్ర్య దు:ఖమెల్ల - వాసి కెక్కించు సంసార వార్ధి గడుపు!
శాశ్వతంబైన పదవిచ్చు జగతియందు - రామ! తారక! దశరథ రాజ తనయ!

7 . హరి రామ నీవు నా యంత రంగమునందు - సాక్షివై యుండుట సత్యమైన
పావనంబాయెను పాంచ భౌతిక మైన - కాయంబు జలముల గడుగ నేల ?
మమకారముడిగిన మానును కర్మంబు - వేధించు వేల్పుల వెరువ నేల?
విత్తు క్షీణంబైన వీడును కర్మంబు - మోహంబు లుడిగితే మోక్ష మిదియె.

నిష్ఠ యీ రీతి నిజముగా నిలచె నేని - మనసు దృఢమైన చాలదా మాయ గెల్వ?
భ్రాంతు లుడిగిన బ్రహ్మంబు బట్ట బయలు - రామ! తారక! దశరథ రాజ తనయ!

8 . కామితార్థము లిచ్చు కామ ధేనువు గల్గ - వెల బెట్టి గోవుల వెదుక నేల?
మరణంబు లేకుండ మందు గల్గుండగా - సభయులై యమునికి జడియ నేల?
కల్యాణ మొసగెడి కల్ప వృక్షము గల్గ - వన పుష్ప ఫలముల వాంఛ యేల?
అమరుల కబ్బని యమృతంబు సేవించి - మధు రసంబుల మీద మమత లేల?

తార తమ్యంబు లీ రీతి తథ్య మనుచు - భజన సేతురు మిమ్ముల బ్రహ్మ విదులు
నతులు చేయుదు రెప్పుడు నుతుల తోడ - రామ! తారక! దశరథ రాజ తనయ!

9 . భూపతి యై పుట్టి భూమి నేలగ వచ్చు - శత్రు సంహారమ్ము జేయ వచ్చు,
చౌ షష్టి విద్యల చదివి చెప్పగా వచ్చు - బహు మంత్ర సిద్ధుల బడయ వచ్చు,
కోటికి పడగెత్తి కొల్ల బుచ్చగ వచ్చు - సకల మంత్రంబుల చదువ వచ్చు,
గంగాది నదులకు గ్రక్కున బోవచ్చు - నుత్తమా శ్రమముల కరుగ వచ్చు!

మగుడ జన్మంబు రాకుండ మాయ గెలుచు - విద్య సాధించి శత్రుల విరచి కట్టి
యరసి బ్రహ్మంబు గనుగొడు డంతె చాలు - రామ! తారక! దశరథ రాజ తనయ!

10 .సతమని దేహంబు సంతసిల్లగ నేల - నిలుచునా యిది వట్టి నీటి బుగ్గ!
కాయంబు నిలువదు కడు బ్రహ్మ కైనను - ప్రాణంబు నిలుచునా భ్రాంతి గాక?
విభవంబు జూడకు విస్మయంబొందకు - సంపద లెప్పుడు సతము గాదు!
పరుల నా వారని పాటింప జెల్లదు - వెళ్ళంగ తన వారు వెంట రారు.

అనుచు తలపోసి బుధులెల్ల యాస లుడిగి - మోహ జాలంబులో బడి మోస పోక
నిన్ను సేవింపు చుందురు నీరజాక్ష - రామ! తారక! దశరథ రాజ తనయ!

Sunday, February 20, 2011

రామ తారక శతకము 1

శ్రీరాములు. ======= ' రామ తారక శతకము ' మా ఇంట్లో మా అమ్మగారి చేతి వ్రాతలో ఉన్న ఒక పుస్తకంలో దొరికింది. ఎవరో ఇచ్చిన అచ్చు పుస్తకం లో గల ఈ శతకాన్ని, కీర్తి శేషురాలైన మా అమ్మగారు ఆమె గర్భంలో నేనున్న సమయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ రామ చంద్రుని మనసులో నిల్పుకొని వ్రాశారని మా అక్కగారు చెప్పారు. 

 రామ తారక శతకము 'రామ! తారక!దశరథ రాజ తనయ!' అనే మకుటంతో ప్రకాశిస్తూంది. మొత్తం 97 సీస పద్యాలు ఉన్నాయి. అన్ని పద్యాలూ రామ చంద్రుని పట్ల పరిపూర్ణ భక్తిని ప్రకటిస్తూ, ఆయనను శరణాగతి చేస్తూ సాగుతాయి. ఎన్నో జీవిత సత్యాలతో మానవుని కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ నడుస్తాయి. పాప పుణ్యాల మధ్య తేడాను స్పష్టంగా పేర్కొంటాయి. అన్ని పద్యాలు అతి తేలికైన పదాలతో సామాన్యులకు అంటే పామరులకు కూడా సులువుగా అర్థమయే మాటలతో భావాన్ని తేట తెల్లం చేస్తూ ఉంటాయి. నిత్య పారాయణకు అనుకూలంగా ఉంటాయి. వ్యాకరణ పరంగా కూడా అన్ని పద్యాలు సర్వాంగ సుందరంగా శోభిల్లుతున్నాయి. చాలా పద్యాల్లో అంత్యను ప్రాసాలంకారం అలరారుతూ ఉంటుంది. ఇంత సుందరమైన శతకాన్ని రచియించి ధన్యుడై రామ సాన్నిధ్యాన్ని చేరిన శతక కర్త పేరు ఎక్కడా లేకపోవడం విచారకరం. 

 ఆధ్యాత్మికాసక్తి గల పెద్దలు నిత్యం చదువుకొని తరించడానికి ఉపయుక్తమైన ఈ రామ తారక శతకము ఎల్లవారూ పఠించ దగ్గదిగా తలచి నా బ్లాగులో దీన్ని పొందు పరుస్తున్నాను. ఈ శతకాన్ని చదివిన వారు ఆ రామ భద్రుని కృపా కటాక్షములకు పాత్రులగుదురు గాక. దీన్లో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే పామరుడనైన నాకు అవి చెందుతాయి గానీ శతక కర్తకు అవి అంటవు అని సవినయంగా మనవి చేస్తున్నాను. 

 1 . శ్రీ రామ నామమే శృంగార వర్ణన - సకల శాస్త్ర వివేక సాధనంబు ! శ్రీ రామ నామమే శృంగార చారిత్ర - సకల దాన విశేష సంగ్రహంబు ! శ్రీ రామ నామమే శృంగార ధ్యానంబు - సకల తీర్థచరణ సత్ఫలంబు! శ్రీ రామ నామమే శృంగార చింతన - సకల మంత్ర రహస్య సమ్మతంబు! అనుచు బ్రహ్మాది సురలెల్ల నను దినంబు - భక్తితో రామ మంత్రంబు పఠన జేసి మ్రొక్కి సేవించి చెందిరి మోక్ష పదవి - రామ! తారక! దశరథ రాజ తనయ!

 2 . శ్రీ రామ నాయొక్క జిహ్వ పై మీ నామ - యక్షర బీజము లమర జేసి వాణి నా పలుకుల వసియింపగా జేసి - శాస్త్ర యుచ్చాటన సలుప బూని యుక్తియు బుద్ధియు నూహ దాసుని కిచ్చి - భక్తితో మీ పాద భజన యందు నాసక్తి బుట్టించి యమృత సారంబెల్ల - తారక శతకంబు త్వరితముగను పలుకు పలికించు వేవేగ పరమ పురుష - యింపుగా చదువు వారికి నిహము పరము దాతవై యిచ్చి రక్షించు ధన్య చరిత - రామ! తారక! దశరథ రాజ తనయ! 

 ౩. నరులార సేయుడీ నారాయణ స్మరణ - మ్రొక్కి సేవించితే మోక్షకారి! జనులార సేయుడీ జయరామ నామంబు - కామ్యార్థముల కెల్ల కల్పవల్లి ! ప్రజలార సేయుడీ పంకజాక్షుని పూజ - సాయుజ్య పదవికి సౌఖ్యకారి! మానవ బుధులార మరువక దలచుడీ - పరమాత్మ శబ్దంబు పాపహారి! పెక్కు మార్గంబులను బోక ప్రేమ చేత - భక్తితో రామ మంత్రంబు పఠన జేసి మ్రొక్కి సేవించి జెందుడీ మోక్ష్ పదవి - రామ! తారక! దశరథ రాజ తనయ!

 4 . తలచుడీ జనులార తారక నామంబు - గోవింద నామమే కొల్ల గొనుడి! కృష్ణ నామంబెపుడు కీర్తన జేయుడీ - మాధవ నామంబు మరువకండి! హరినామ కీర్తన లందందు జేయుడీ - వాసుదేవ స్మరణ వదలకండి! విష్ణు సంకీర్తన విడువక సేయుడీ - నరసింహ నామంబు నమ్ముకొనుడి! కలియుగంబున జనులార కష్టపడక - నామ కీర్తన పరులౌట నయము సుండి! పునహ జన్మంబు మరిలేదు భూమి యందు - రామ! తారక! దశరథ రాజ తనయ! 

 5 . ఓపియోపక నైన యొక్క మారైనను - వెరచి వెరువకనైన వేడ్క నైన హా రామ హా కృష్ణ హా యచ్యుతా యని - భయము తోనైనను భక్తి నైన ప్రేమతో పుత్రుల పేరు పెట్టైనను - చిలుకను బెంచైన చెలిమి నైన భువిలోన కీర్తికి పురము గట్టైనను - వన తటాకము లుంచి వాంఛ నైన నీదు నామంబు బలుకుట నిఖిల సుఖము - గలుగు వర్థిల్లు పురుషుండు ఘనత మెరయు జన్మ కర్మంబు లతనికి చెప్ప నేల - రామ! తారక! దశరథ రాజ తనయ!

పాలకొల్లు గోపురం

రెండ్రోజుల క్రితం మా బంధువులింట్లో శుభ కార్యముంటే పాలకొల్లు వెళ్ళాం.
పాల కొల్లు పేరున్న శైవ క్షేత్రం. అక్కడి క్షీరారామ లింగేశ్వరస్వామి గొప్ప మహత్తు గల దేవుడు.
క్షీరారామం పంచారామాల్లో ఒకటి.
పాలకొల్లు శివాలయం గాలిగోపురం చాలా ఎత్తుగా రమ్యమైన శిల్పకళతో శోభిస్తూ ఉంటుంది.
ఒకప్పుడు దక్షిణ భారత దేశంలోనే అతి పెద్దదైన గోపురంగా పాలకొల్లు గోపురం ప్రసిద్ధి చెందిందని అంటారు.

మా నాన్నగారు నా చిన్నప్పుడు ఈ పాలకొల్లు గోపురం గురించి ఒక చమత్కారం చెప్తూండేవారు.

వారి చిన్నప్పుడు గోదావరి జిల్లాల్లో ఒక వస్తాదు ఉండేవాడట. మంచి కండ బలంతో దేహ దారుఢ్యంతో గొప్ప
గొప్ప విన్యాసాలు చేసి అందర్నీ ఆశ్చర్య పరచే వాడట.

ఒకసారి అతను తన గ్రామస్తులతో ' నేను పాలకొల్లు గోపురం మోసెయ్యగలను, ఒక్క ఆరు నెలలు నాకు మంచి
పుష్టికరమైన, బలమైన ఆహారాన్ని పెట్టే ఏర్పాటు చేస్తే' అని పందెం కాసేడట. అందరూ నువ్వు యెంత వస్తాదువైనా
పాలకొల్లు గోపురం మొయ్యడం నీవల్ల అయ్యే పనికాదు, పందెం వద్దు అన్నారట.

అతను కాదని పందెం కుదుర్చు కొన్నాడట.

ఆరు నెలలు అతన్ని బాగా మేపడానికి, అతను గోపురాన్ని మొయ్యడానికీ. అతను ఆ పని చెయ్య లేక
పోతే అతన్ని మేపడానికయిన ఖర్చును అతను తిరిగి గ్రామస్తులకు ఇచ్చెయ్యాలి. అదీ పందెం.
అతనా విన్యాసాన్ని మహాశివ రాత్రి నాడు చెయ్యాలి.

ఆరు నెలలు గడచి పోయాయి. ఈ ఆరు నెలలూ అతన్ని మా బాగా మేపారు.
శివరాత్రి రానే వచ్చింది.

బోలెడు జనం. మన వస్తాదు పాలకొల్లు గోపురాన్ని మొయ్యాలి.
సాయంత్రం 4 గంటలయ్యింది.

పాలకొల్లు శివరాత్రి భక్తజనం తో కిటకిట లాడిపోతోంది.
అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. నిజంగా మనవస్తాదు అన్నంత పనీ చేస్తాడా లేక తోక ముడిచేస్తాడా అని.

సరే వస్తాదు గుడి దగ్గరికి వచ్చాడు. బయటనుంచి దేవుడుకి నమస్కరించాడు.
లోపలికి వెళ్లి క్షీర లింగేశ్వరుని దర్శనం చేసుకొన్నాడు.
బయటికి వచ్చి నంది శృంగాల మధ్యనుంచి మళ్ళా శివ దర్శనం చేసుకొన్నాడు.

ఒక నిముషం ఆలయం ఆవరణలో కూర్చున్నాడు. బయటికి వచ్చాడు.
గోపురం ముందు నిలబడ్డాడు. తలెత్తి గోపురం శిఖరం వంక చూశాడు.

అబ్బా అని నోటితో ముఖంతో ఒకసారి హావభావ ప్రదర్శన చేసాడు.

గోపురాన్ని మోయగలిగి తన మాట నిలబెట్టుకొనేలా శక్తి ప్రసాదించమని శివుణ్ణి ప్రార్థించాడు.

నలుదిక్కులా అందరి వంకా చూశాడు. అభివాదం చేశాడు.

అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.

అంతే ఒక్కసారిగా 'హరహరా' అంటూ గోపురం ముందు వంగున్నాడు.

అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అంతా నిశ్శబ్దం.

మన వస్తాదు ' ఊ! పెట్టండి!' అన్నాడు.

ఎవరికీ అర్థం కాలేదు.

మళ్ళా అన్నాడు. 'ఊ! పెట్టండి!'

ఎవరికీ అర్థం అవలేదు. అందరూ ఆశ్చర్య పోయారు.

గోపురాన్ని మోయ్యకుండా ఏమిటో పెట్టమంటాడేమిటి???????????

ఇక ఆగలేక ఒక పెద్దమనిషి అడిగాడు.

'ఏమిటయ్యా పెట్టండి అంటావు? గోపురం మోస్తానన్నవుగా? మొయ్యి.'

వస్తాదు: 'అదేనండీ! నేను సిద్ధం.'

పెద్దమనిషి : 'మరి మొయ్యవయ్యా'

వస్తాదు: 'భలే వారండీ. మీరెవరూ గోపురాన్ని ఎత్తి నా వీపు మీద పెట్టందే నేనెలా మోసేదండీ?
అలా చూస్తారేమిటండీ? గోపురాన్ని నా వీపు మీద పెట్టండి. మోస్తాను.'

!!!!!!!!!!!!!!!!!

Tuesday, February 15, 2011

నా పూరణ

నా పూరణ
****************
సమస్య:

సీతామానసచోరుడెవ్వరనినన్,శ్రీకృష్ణమూర్తేగదా!

మాతా రుక్మిణి ! లక్ష్మివై కృతమునన్ మమ్మేలవే! సీతవై
త్రేతంబందున పొందవే ధరణి సత్కీర్తిన్!అనన్, నారదా!
సీతా మానస చోరు డెవ్వ రనినన్ శ్రీకృష్ణమూర్తే గదా!
ప్రీతిన్ రాఘవ మూర్తియై శివుని పెన్విల్ద్రుంచె నీకై యనెన్.

శ్రీ కంది శంకరయ్య గారు తమ 'శంకరాభరణం ' బ్లాగులో
యిచ్చిన సమస్యకు నా పూరణ యిది. పలువురు కవి-
మిత్రుల మనోజ్ఞమైన పూరణలను కూడా ఆ బ్లాగులో
చూడవచ్చును.




Friday, February 11, 2011

ఒక మంచి పద్యం



కీ.శే. దినవహి సత్యనారాయణ గారు,
కీ.శే. దినవహి భాస్కరమ్మ గారు.



ఒక మంచి పద్యం
*************************************************************
కీ.శే. దినవహి సత్యనారాయణ గారు గొప్ప కవి. తెలుగు, హిందీ, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో ప్రవీణులు. గోస్వామి తులసీదాసు హిందీలో రచించిన 'శ్రీ రామ చరిత మానసం ' తెలుగులోకి అనువదించారు. ఆ గ్రంథం బహుళ ప్రజాదరణ పొందింది.
అదే కాకుండా మరి కొన్ని పుస్తకాలను కూడా ఆయన వ్రాశారు. హిందీ, తెలుగు, ఆంగ్ల వ్యాకర ణాల్లో మంచి దిట్ట. 'విద్యా భాస్కర' బిరుదాంకితులు.

శ్రీ సత్యనారాయణ గారు మంచి వక్త. మృదు స్వభావి. దయార్ద్ర హృదయులు.
అయన రాజమహేంద్రవరంలో ఉండేవారు.

ఆయనను మా వయసు వాళ్ళందరం (1970 లలో) తాతగారూ అని ప్రేమతో పిలిచే వాళ్ళం.
ఆయన కూడా అంతే ప్రేమతో మమ్మల్ని చేరదీసేవారు. మాకు వ్యాకరణ పాఠాలను చెప్పేవారు.
తాతగారు ఎప్పుడూ రామనామాన్నే స్మరిస్తూ ఉండేవారు.

అంతిమ క్షణాల్లో ' రామా రామా' అంటూ ఆ పరంధామునిలో ఐక్యమైన ధన్యజీవి ఆయన.

ఆయన ఒక సందర్భంలో మానవ జీవితాన్ని చలన చిత్రం తోనూ, చలన చిత్రాన్ని తెరపై చూపే యంత్రంతోనూ (projector) పోలుస్తూ మంచి పద్యాన్ని చెప్పారు.

ఎవ్వరి కెవ్వరీ భువిని ఈశ్వరు డద్భుత కాలచక్రమున్
రివ్వున ద్రిప్పుచుండ పలురీతుల జీవపు వెల్గునన్ మహిన్
నవ్వుచు కేరియాడుచును నాదిగ భావన చేయుచుందు మా
దివ్వెయడంగ నన్నియును ద్రెళ్ళెడు వైద్యుతయంత్ర పుత్రికల్!


సినిమా ప్రొజెక్టర్లో తిరిగే చక్రం, వెలిగే బల్బూ, అది పని జేయడానికి విద్యుత్తూ, ఆ బొమ్మలను చూపే తెరా ఉంటాయి కదా. అలాగే మహి అంటే భూమి అనేది తెర. ఈశ్వరుడు నడిపే ప్రొజెక్టర్లో చక్రం కాల చక్రం. బల్బు జీవపు దివ్వె. ఆడే బొమ్మలు మనం. విద్యుత్తున్నంత సేపూ తెర మీద బొమ్మలు ఆడినట్లు మనం ఈ భూమి మీద ప్రాణం ఉన్నంత సేపూ రకరకాల లీలలు చూపిస్తూ అంతా నాదే అనుకొంటాము. విద్యుత్తు పొతే తెర మీద బొమ్మలు ఆగిపోయి నట్లు జీవపు దివ్వె ఆరిపోతే మనపని కూడా ఆఖరు. ఎంత అద్భుతమైన భావన!





Monday, February 7, 2011

నా పూరణ

నా పూరణ
***********
సమస్య: భార్య లిద్దరు శ్రీ రామ భద్రునకును

కైక పంపించె రాముని కానలకును
మిగుల పొగిలిరి దశరథు మిగిలినట్టి
భార్య లిద్దరు, శ్రీ రామ భద్రునకును
మాత్ర మమిత భక్తి మువురు మాతలందు.

శ్రీ కంది శంకరయ్య గారు తమ 'శంకరాభరణం ' బ్లాగులో
యిచ్చిన సమస్యకు నా పూరణ యిది. పలువురు కవి-
మిత్రుల మనోజ్ఞమైన పూరణలను కూడా ఆ బ్లాగులో
చూడవచ్చును.







Sunday, February 6, 2011

ఆదిత్య గీతం























ఉత్తరాయణ పుణ్య కాలంలో వచ్చే మాఘమాసానికి ఆధ్యాత్మిక పరంగా యెంతో ప్రాధాన్యత ఉంది.
మాఘమాసంలో ప్రాతఃకాలాన్నే నదీ స్నానాన్ని చేసి ప్రత్యక్ష దైవమైన సుర్యభగవానుని ప్రార్థించమని
భారతీయ సనాతన ధర్మం చెపుతుంది.
కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు సూర్యభగవానుణ్ణి ప్రస్తుతిస్తూ ఆదిత్యగీతా లానే అందమైన
పాటలను వ్రాశారు.
ఒకప్పుడు ప్రభాత సమయంలో ఆకాశవాణి ద్వారా భక్తిరంజని లో మధురమైన గాయకుల గళాల్లో
ఈ ఆదిత్య గీతాలు ఇంటింటా మారు మ్రోగుతూ జనాలను ఉత్తేజితులను చేస్తూ ఉండేవి.
అటువంటి ఆదిత్య గీతాల్లో మణిపూస లాంటి ఒక గీతం ఇది.
ఈ గీతం లో కవి చేసిన పద ప్రయోగం, కవిత్వంలోని అలంకార ప్రయోగం అనుపమానం.

************ **************** ************* ****************

పల్లవి :

అడుగడుగో దినరాజు చూడు - పాల కడలి తరగలపైన వెడలి వస్తున్నాడు - అడుగడుగో దినరాజు చూడు
పొడుపు కొండలపైన కొలువు దీరిచినాడు - వెలుగుల యెకిమీడు - వేయి చేతుల రేడు
అడుగడుగో...
చరణం ౧.
అందాల రేవెల్గు జోడు - అరవిందాల సావాసగాడు ... అందాల ..
మందేహులను గెల్చి - సిందూర రుచి దాల్చి ... మందే ..
కన్దోయికిని విందు - గావించు తున్నాడూ ... కందో ..
అడుగడుగో...
చరణం ౨.
బంగారు కిరణాల వేల్పు - చిగురు చెంగావి మువ్వల్వ దాల్పు ... బంగారు ..
రంగారు తొలి ప్రొద్దు - సింగార మది ముద్దు ... రంగారు ..
పొంగారు సుషమా - తరంగాల సరిహద్దు ... పొంగారు ..
అడుగడుగో...
చరణం ౩.
కంటీ కిమ్పగు వెల్గు పంట - కారు కటిక చీకటి గుండె మంట ... కంటీ ..
ఒంటీ చక్రపు రథము - అంటీ అంటని పథము ... అంటీ ..
కుంటీ సారధి తోడ - మింటా పరుగిడు నంట ... కుంటీ ..
అడుగడుగో...

Thursday, February 3, 2011

కాళిదాస కృత సకలజననీ స్తవః


౧. అజానంతో యాన్తి క్షయ మవశ మన్యోన్య కలహై రమీ మాయా గ్రంథౌ తవ పరి లుఠoత సమయినః|
జగన్మాత ర్జన్మ జ్వర భయ తమః కౌముది రియం నమస్తే కుర్వాణ శ్శరణ ముపయామో భగవతీం||

౨. వచస్తర్కా గమ్య స్వరస పరమానంద విభవ ప్రబోధాకారాయ ద్యుతి దళిత నీలోత్పల రుచే |
శివాద్యారాధ్యాయ స్తనభర వినమ్రాయ మహతే నమో యస్మై కస్మై చన భవతు ముగ్ధాయ మహసే||

౩. లుఠద్గున్జాహార స్తన భరణ మన్మధ్య లతికా ముదంచద్ఘరామ్భః కణ గుణిత వక్త్రామ్బుజ రుచిమ్|
శివం పార్థ త్రాణ ప్రవణ మృగయాకార కరుణం శివా మన్వగ్యాన్తీం శరణ మహ మన్వ్యైమి శబరీం||

౪. మిథః కేశాకేశి ప్రథన నిధనా స్తర్క ఘటనా బహుశ్రధ్దా భక్తి ప్రణత విషయాశ్చాపి విధయః |
ప్రసీద ప్రత్యక్షీ భవ గిరిసుతే దేహి చరణౌ నిరాలంబే చేతః పరిలుఠతి పారిప్లవమిదం||

౫. శునాంవా వహ్నేర్వా ఖగ పరిషదం వా యదశనం తయా కేన క్వేతి క్వచి దపి న కశ్చి త్కలయతి|
అముష్మి న్విశ్వాసం విసిహి నిజమహ్నాయ వపుషి ప్రపద్యేధా శ్చేతస్సకలజననీ మేవ శరణం ||

౬. అనాద్యంతా భేద ప్రణయ రచితాపి ప్రణయినీ శివస్యాజర్యత్వం పరిణయ విధౌ దేవి గృహిణీ|
సవిత్రీ భూతానా మపి యదుద భూశ్శైల తనయా తదేత త్సంసార ప్రణయన మహా నాటక ముఖం||

౭. బ్రువంత్యేతే తత్త్వం భగవతి సదన్యే విదుర సత్పరే మాతః ప్రాహుస్సద సదపి చాన్యేప్య సదసత్|
చిరేణై తత్సర్వం సమభి దధతే దేవి సుధియ స్తదేత త్త్వన్మాయా విలసిత మశేషం నను శివే||

౮. తటిత్కోటి జ్యోతిర్ధ్యుతి దళిత షడ్గ్రన్థి ఘటనం ప్రవిష్టం స్వాథారే పునరపి సుధా వృష్టి వపుషా |
కిమప్యష్టా వింశత్కిరణ శకలీ భూత మనిశం భజే ధామ శ్యామం కుచభర నతం బర్బర కచం||

౯. చతుష్పత్రాంత ష్షడ్దళ పుట భగాంత స్త్రి వలయాం స్ఫుదద్విద్యుద్వహ్ని ద్యుమణి నియుతాభ ద్యుతియుతే|
షడశ్రం భిత్వాదౌ దశ దళ మథ ద్వాదశ దళం కళాశ్రంచ ద్వ్యశ్రం గతవతి నమస్తే గిరిసుతే||

౧౦.కులం కేచిత్ప్రాహు ర్వపుర కుల మన్యే తవ బుధాః పరే తత్సం భేదం సమభిదధతే కౌళ మపరే|
చతుర్ణా మేతేషా ముపరి కిమపి ప్రాహు రపరే మహామాయే తత్త్వం తవ విధ మమీ నిశ్చను మహే||

౧౧.ప్రకాశానందాభ్యా మవిదితచరీం మధ్యపదవీం ప్రవిశ్యై తద్ద్వంద్వం రవి శశి సమాఖ్యం కబళయన్ |
ప్రపద్యోర్ధ్వం నాదం లయ దహన భస్మీ కృత కులః ప్రసాదాత్తే జంతు శ్శివ మతుల మంబ ప్రవిశతే ||

౧౨.షడధ్వారణ్యానీం ప్రళయ శిఖి కోటి ప్రతి రుచా రుచా భస్మీ కృత్య స్వపద కమల ప్రహ్వశిరసం|
వితన్వానా శైవం కిమపి వపు రిందూపల రుచిః కుచాభ్యా మానమ్ర శ్శివ పురుష కారో విజయతే||

౧౩.మనుష్యాస్తిర్యంచో మరుత ఇతి లోకత్రయ మిదం భవాంభోదౌ మగ్నం త్రిగుణలహరీ కోటి లుఠితమ్|
కటాక్షశ్చేద్యత్ర క్వచన తవ మాతః కరుణయా శరీరీ సద్యోయం వ్రజతి పరమానంద తనుతాం||

౧౪.షడాధారా వర్తై రపరిమితమంత్రోర్మి పటలై ర్వలన్ముద్రా ఫేనై ర్బహు విధలసద్ధైవత ఝషైః |
క్రమస్రోతోభిస్త్వం వహసి పర నాదామృత నదీం భవాని ప్రత్యంచ శ్చిద చిద మృతాబ్ధి ప్రణయినీ||

౧౫.మహీపాలో వహ్ని శ్వసన వియగా త్మేన్దు రవిభి ర్వపుర్భిర్గ్రస్తాశ్చైరపి తవ కియా నంబ మహిమాం |
అమూన్యా లోక్యన్తే భగవతి న కుత్రా ప్యణుతరా మనాస్త ప్రాప్తాని త్వయి తు పరమ వ్యోమ వపుషి||

౧౬.కళాం ప్రాజ్ఞామాజ్ఞాం సమయ మనుభూతిం సమరసం గురుం పారంపర్యం వినయ ముపదేశం శివపరం|
ప్రమాణం నిర్వాణం ప్రకృతి మతిభూతం పరగుహాం విధిం విద్యామాహు స్సకల జననీమేవ మునయః||

౧౭.ప్రలీనే శబ్దౌఘే తదనువిరతే బిందు విభవే తతస్తత్త్వే చాష్ట ధ్వనిభి రనపాయి వ్యధిగతే|
గతే శాక్తే పర్వణ్యపి కలిత చిన్మాత్ర గహనాం స్వయం వ్యక్తం యోగీ రచయతి శివానంద తనుతాం||

౧౮.పరానందాకారాం నిరవధిక మైశ్వర్య వపుషం నిరాఘాత జ్ఞాన ప్రకృతి మనవచ్చిన్న కరుణాం|
సవిత్రీం భూతానాం నిరతిశయ మాయాస్పద పదం భవో వా మోక్షో వా భవతు భవతీ మేవ భజతాం||

౧౯.జగత్కాయే కృత్వా తదపి హృదయే తచ్చ వపుషే పుమాంసం బిందుస్థం తమపి కరుణాఖ్యేతి గహనే|
తదేత జ్ఞానాఖ్యే తదపి వియదానంద గహనే మహా వ్యోమాకార స్తదను భవ శీలో విజయతే||

౨౦.విదే విద్యే వేద్యే వినయ సులభే వేద గుళికే విచిత్రే విశ్వాద్యే వివిధ సమయే వీత జననే|
శివాజ్ఞే శీలస్తే శివపద వదాన్యే శివనిధే శివే మాతర్మహ్యం త్వయివితర భక్తిం నిరుపమాం ||

౨౧.విధేర్ముండం హృత్వా యదకురుత పాశం కరతలే హరిం శూలప్రోతం హి యదగ మదంసా భరణతాం|
అలం చక్రే కంఠం యదపిగరళే నాంబ గిరిశ శ్శివస్థాయా శ్శక్తేస్తదిద మఖిలం తే విలసితం||

౨౨.విరించాఖ్యా మాతా స్సృజసి హరి సంజ్ఞాత్వమసిచ త్రిలోకీం రుద్రాఖ్యా హరసి నిదధాసీశ్వర దశాం|
భవంతీం సారాఖ్యాం శివ యసి చ పాశౌఘ దళ నాత్త దేకానైకాసి త్వ మసి కృతి భేదైర్గిరి సుతే||

౨౩.మునీనాం చేతోభి: ప్రముదిత కషాయై రపి మనాగసహ్యే సంస్ప్రష్టుం చకిత చకితై రంబ సతతం|
శ్రుతీనాం మూర్ధానః ప్రకృతి కఠినాః కోమలతలే కథం వా విందంతే పద కిసలయే పర్వత సుతే||

౨౪.పితా మాతా భ్రాతా సుహృదనుచర స్సద్మ గృహిణీ వపు: పుత్రః క్షేత్రం ధనమపి యదా మాం విజహతి|
తదా మే భిందానా సపరి భవ మోహాంధ తమసం మహాజ్యోత్స్నా మాతర్భవ కరుణయా సన్నిధి కరీ||

౨౫.ప్రియంగు శ్యామాంగీ మరుణ తర వాసః కిసలయా నమున్మీలన్ముక్తా ఫల కుసుమ నైపథ్య సుభగాం|
స్తన ద్వంద్వ స్ఫార స్తబక నమితాం కల్ప లతికాం సకృధ్ధ్యాయంత స్త్వా మభి దధతి సంతో భగవతీం||

౨౬.శివ స్త్వం శక్తి స్త్వం త్వ మసి సమయ స్త్వం సమయినీ త్వ మాజ్ఞా త్వం దీక్షా త్వ మయ మణి మాది ర్గుణ గణః|
అవిద్యా త్వం విద్యా త్వ మసి నిఖిలం తత్త్వ మపరం పృథక్త్వత్తః కించి ద్భగవతి న వీక్షా మహ ఉమే||

౨౭.పురః పశ్చా దంత ర్బహి రపరిమేయం పరిమితం చిరం స్థూలం సూక్ష్మం సకల కమలం గుహ్య మగుణం|
దవీయో నేదీయ స్సదసదిద విశ్వం భగవతీం సదా పశ్యంత్యాజ్ఞాం భవసి భువన క్షోభ జననీం||

౨౮.త్వయాసౌ జానీతే రచయతి భవత్యైవ సతతం త్వమేవేఛ్ఛత్యమ్బ త్వ మసి తన వోప్యస్య విహితాః |
జగత్సామ్యం శంభో ర్వహసి పరమ వ్యోమవపుష స్తథా ప్యర్థం భూత్వా విహరసి హరస్యేతి కిమిదం||

౨౯.మయూఖాః పూష్ణీవ జ్వలన ఇవ తద్దీప్తి కణికాః పయోధౌ కల్లోల ప్రతి భయ మహిమ్నీవ పృషతాః|
ఉదేత్యో దేత్యంబ త్వయిసహ నిజై సాత్త్విక గుణైర్భజంతే తత్వౌఘాః ప్రణయ మనుకల్పం పరవశాః||

౩౦.సుతా దక్ష స్యాదౌ కిల సకల మాతస్త్వ ముదభూ స్సరోషం తం హిత్వా తదనుగిరి రాజస్య తనయా|
అనాద్యంతా శంభో రపృథగపి శక్తి ర్భగవతీ వివాహాజ్జాయాసీ త్యహహ కో వేత్తి చరితం||

౩౧.కలాస్త్వద్దీప్తీనాం రవిశశి కృశాను ప్రభృతయః పరం బ్రహ్మ క్షుద్రాస్తవ నియత మానంద కలితాః|
శివాదిక్షిత్యంతం త్రివళిత తనోర్విశ్వ ముదరే తవాస్తే భక్తస్య స్ఫురసి హృది చిత్రం భగవతి||

౩౨.శరీరమ్ క్షిత్యంభః ప్రభృతిరచితం కేవల మచిత్సుఖం దుఃఖం చాయం కలయతి పర శ్చేతన ఇతి|
స్ఫుటం జానానోపి ప్రభవతి స దేహీ రహయితుం శరీరాహంకారాత్తవ జనని బాహ్యే గిరిసుతే||

౩౩.అసంఖ్యై ప్రాచీనై ర్జనని జననైః కర్మ నిలయా త్సకృజ్జన్మన్యంతే గురువపుష మాసాద్య వపుషి|
తవాప్యాజ్ఞాం శైవీం శివాన మపి త్వాం విదితవా న్న యేయం త్వత్పూజామల వినమనే నైవ దివసాన్||

౩౪.భువి పయసి కృశానౌ మారుతే ఖే శశాంకే సవితరి యజమానే ప్యష్టధా శక్తిరేకా|
వహసి కుచభరాభ్యాం యా వినమ్రాసి విశ్వం సకలజనని సా త్వం పాహి మామిత్యవాచ్యం||

౩౫.యష్షట్పత్రం కమల ముదితం తస్య యా కర్ణికాఖ్యా యోని స్తస్యాః ప్రథితముదరే తత్తదోంకార పీఠం|
తస్యాప్యంతః కుచభరనతాం కుండలీతి ప్రసిధ్దాం శ్యామాకారాం సకలజననీం చేతసా చింతయామి||

ఇతి శ్రీ మత్కవిరాజరాజమకుటరత్న రాజినీరాజిత చరణారుణరాజీవస్య
శ్రీ రాజరాజేశ్వరీ కరుణాకటాక్షలబ్ధనిఖిలానవద్య విద్యస్య
తత్రభవతశ్శ్రీకాళిదాసస్య
కృతిషు
శ్రీసకలజననీస్తవః
సంపూర్ణః































\