శాంతంబు నుంచిన శాశ్వత పదమొందు - శత్రుత్వమున మహా సంకట మగు
కుటిలత్వమునను దుష్క్రు తమొందు మనుజుడు - కుటిలత్వమే చేటు కువలయేశ
బద్ధులై నటువంటి బంధుల గూడితే - తన వెంట నొకరైన తరలి రారు
ఇట్టివారలు నాకేల ఇనకులేశ -
నీదు కృప గట్టిగా నాకు నిచ్చి తొలుత
పరమ పదమిచ్చి నన్ను చే పట్ట వయ్య -
రామ! తారక! దశరథ రాజ తనయ!
97 . ఆవేళ యమునిచే నాయాస పడలేక - నీవేళనే మిమ్ము నెలమితోడ
నా తల్లి దండ్రి వని నమ్మి నీ పాదముల్ - పట్టి సేవించెద పద్మ నయన
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ యని మిమ్ము - స్మరణ చేసెద నయ్య చక్ర పాణి
కోదండ కోదండ కోదండ రామ యని - కొలిచి సేవించెద కోర్కె దీర
పద్మ సమ్భవ ముఖ నుత పరమ పురుష - నన్ను వేగాచి రక్షించు నయము తోడ
కరుణ తోడుత నను జూడు కమల నయన - రామ! తారక! దశరథ రాజ తనయ!
No comments:
Post a Comment