
రామ తారక శతకము 'రామ! తారక!దశరథ రాజ తనయ!' అనే మకుటంతో ప్రకాశిస్తూంది.
మొత్తం 97 సీస పద్యాలు ఉన్నాయి. అన్ని పద్యాలూ రామ చంద్రుని పట్ల పరిపూర్ణ భక్తిని
ప్రకటిస్తూ, ఆయనను శరణాగతి చేస్తూ సాగుతాయి. ఎన్నో జీవిత సత్యాలతో మానవుని
కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ నడుస్తాయి. పాప పుణ్యాల మధ్య తేడాను స్పష్టంగా పేర్కొంటాయి.
అన్ని పద్యాలు అతి తేలికైన పదాలతో సామాన్యులకు అంటే పామరులకు కూడా సులువుగా
అర్థమయే మాటలతో భావాన్ని తేట తెల్లం చేస్తూ ఉంటాయి. నిత్య పారాయణకు అనుకూలంగా
ఉంటాయి.
వ్యాకరణ పరంగా కూడా అన్ని పద్యాలు సర్వాంగ సుందరంగా శోభిల్లుతున్నాయి.
చాలా పద్యాల్లో అంత్యను ప్రాసాలంకారం అలరారుతూ ఉంటుంది.
ఇంత సుందరమైన శతకాన్ని రచియించి ధన్యుడై రామ సాన్నిధ్యాన్ని చేరిన శతక కర్త పేరు ఎక్కడా
లేకపోవడం విచారకరం.
ఆధ్యాత్మికాసక్తి గల పెద్దలు నిత్యం చదువుకొని తరించడానికి ఉపయుక్తమైన ఈ రామ తారక శతకము
ఎల్లవారూ పఠించ దగ్గదిగా తలచి నా బ్లాగులో దీన్ని పొందు పరుస్తున్నాను. ఈ శతకాన్ని చదివిన వారు
ఆ రామ భద్రుని కృపా కటాక్షములకు పాత్రులగుదురు గాక.
దీన్లో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే పామరుడనైన నాకు అవి చెందుతాయి గానీ శతక కర్తకు అవి అంటవు
అని సవినయంగా మనవి చేస్తున్నాను.
1 . శ్రీ రామ నామమే శృంగార వర్ణన - సకల శాస్త్ర వివేక సాధనంబు !
శ్రీ రామ నామమే శృంగార చారిత్ర - సకల దాన విశేష సంగ్రహంబు !
శ్రీ రామ నామమే శృంగార ధ్యానంబు - సకల తీర్థచరణ సత్ఫలంబు!
శ్రీ రామ నామమే శృంగార చింతన - సకల మంత్ర రహస్య సమ్మతంబు!
అనుచు బ్రహ్మాది సురలెల్ల నను దినంబు - భక్తితో రామ మంత్రంబు పఠన జేసి
మ్రొక్కి సేవించి చెందిరి మోక్ష పదవి - రామ! తారక! దశరథ రాజ తనయ!
2 . శ్రీ రామ నాయొక్క జిహ్వ పై మీ నామ - యక్షర బీజము లమర జేసి
వాణి నా పలుకుల వసియింపగా జేసి - శాస్త్ర యుచ్చాటన సలుప బూని
యుక్తియు బుద్ధియు నూహ దాసుని కిచ్చి - భక్తితో మీ పాద భజన యందు
నాసక్తి బుట్టించి యమృత సారంబెల్ల - తారక శతకంబు త్వరితముగను
పలుకు పలికించు వేవేగ పరమ పురుష - యింపుగా చదువు వారికి నిహము పరము
దాతవై యిచ్చి రక్షించు ధన్య చరిత - రామ! తారక! దశరథ రాజ తనయ!
౩. నరులార సేయుడీ నారాయణ స్మరణ - మ్రొక్కి సేవించితే మోక్షకారి!
జనులార సేయుడీ జయరామ నామంబు - కామ్యార్థముల కెల్ల కల్పవల్లి !
ప్రజలార సేయుడీ పంకజాక్షుని పూజ - సాయుజ్య పదవికి సౌఖ్యకారి!
మానవ బుధులార మరువక దలచుడీ - పరమాత్మ శబ్దంబు పాపహారి!
పెక్కు మార్గంబులను బోక ప్రేమ చేత - భక్తితో రామ మంత్రంబు పఠన జేసి
మ్రొక్కి సేవించి జెందుడీ మోక్ష్ పదవి - రామ! తారక! దశరథ రాజ తనయ!
4 . తలచుడీ జనులార తారక నామంబు - గోవింద నామమే కొల్ల గొనుడి!
కృష్ణ నామంబెపుడు కీర్తన జేయుడీ - మాధవ నామంబు మరువకండి!
హరినామ కీర్తన లందందు జేయుడీ - వాసుదేవ స్మరణ వదలకండి!
విష్ణు సంకీర్తన విడువక సేయుడీ - నరసింహ నామంబు నమ్ముకొనుడి!
కలియుగంబున జనులార కష్టపడక - నామ కీర్తన పరులౌట నయము సుండి!
పునహ జన్మంబు మరిలేదు భూమి యందు - రామ! తారక! దశరథ రాజ తనయ!
5 . ఓపియోపక నైన యొక్క మారైనను - వెరచి వెరువకనైన వేడ్క నైన
హా రామ హా కృష్ణ హా యచ్యుతా యని - భయము తోనైనను భక్తి నైన
ప్రేమతో పుత్రుల పేరు పెట్టైనను - చిలుకను బెంచైన చెలిమి నైన
భువిలోన కీర్తికి పురము గట్టైనను - వన తటాకము లుంచి వాంఛ నైన
నీదు నామంబు బలుకుట నిఖిల సుఖము - గలుగు వర్థిల్లు పురుషుండు ఘనత మెరయు
జన్మ కర్మంబు లతనికి చెప్ప నేల - రామ! తారక! దశరథ రాజ తనయ!
22 comments:
మిస్సన్న మహాశయా !
మీరే వ్రాసారనుకున్నాను మీ
వ్యాఖ్య చదవక ముందు !
చాలా బావుంది !
ఇంత చక్కని శతకాన్ని అందిస్తున్నందుకు ధన్యవాదాలు.
"ఓపి యోపకనైన .... " పద్యం నాకు చాలా నచ్చింది.
గురువుగారూ మీ సందర్శనతో నాబ్లాగు పునీతంయ్యింది. నా ప్రయత్నం సద్వినియోగం అయినట్లుగా భావిస్తున్నాను.నేను ధన్యుణ్ణి.
రామ తారక శతకం చేతి వ్రాతలో ఉన్నందున యతిమైత్రి విషయంలో అక్కడక్కడ సవరణలు చేయవలసి వస్తోంది. నాకు చేతకాని చోట్ల అలానే విడచి పెట్ట వలసి వస్తోంది.
మీరు చదివేటప్పుడు గమనించిన దోషాలను నాకు సూచిస్తే (మీకు వీలయితే) నేను సవరిస్తాను.
ఇంకో సందేహం ఏమిటంటే 'రామ! తారక! ' ఈ రెండు పదాలనూ అలా విడదీసి సంబోధనగా చెప్పడం సరియేనా లేక ' రామ తారక!' అని ఒకే సమాసంగా వ్రాయాలా అని. దయచేసి వివరించండి.
శ్రీరామనామంతో నిండిన 'పద్యం హృద్యం' చాలా చాలా బాగుంది. అమ్మగారి ద్వారా రామభక్తిని అందుకున్న మీరు ధన్యులు..ఆ రామానుగ్రహం మీ వ్రాతల్లో భాసిస్తున్నది...అన్నీ చదివాక మరల వ్రాస్తాను...ఒక మహావ్యక్తి శ్రీ దినవహి సత్యనారాయణగారిని బ్లాగు ద్వారా పరిచయం చేయడం కూడా శ్రీరామ ప్రేరణగా భావిస్తూ....శలవు.
Your Rama Taraka Satakam is very good. Can you give permission to add this to Telugu wikipedia, so that it will have wider clientale to spread Rama farther into our hearts.
Thank you for doing such wonderful work.
Dr. A. Rajasekhar
డాక్టర్ రాజశేఖర్ గారూ స్వాగతం. నేను ముందుమాటలో పేర్కొన్నట్లుగా ' శ్రీ రామతారక శతకం ' ఒక అజ్ఞాత రామభక్తుని కృతి. అది రాముని సొత్తు, రామభక్తుల సొత్తు. అది తెలుగు వికీపీడియాకు అనుసంధానం చేయడానికి ఎవరి అనుమతి కావాలి? రాముని అనుగ్రహం ఉండాలి. అంతే. నిరభ్యంతరంగా అనుసంధానం చేయండి. ధన్యవాదాలు.
శతకంలోని పద్యాలు విన్నా చదివినా చెవుల తుప్పు వదలుతుంది..జిహ్వ సాఫల్యత నొందుతుఇంది....ఈ శతకాన్ని పాడించి నన్ను ధన్యుణ్ని చేయవలెనని మనసా ఆ పంధాముని వేడుకుంటున్నాను......
శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే!!!
శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే!!!
శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే!!!
శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే!!!
శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే!!!
Sir,
I started recording this "Sataka" digitally and shall be back as to its completion very soon...Please bless me..
మా అమ్మ గారివద్ద ఈ రామతారక శతకం 100 పద్యాలు ఉన్నారు. కావాలనుకుంటే సంప్రదించవలసిన నెం:-9441513500
అయ్యా
ఈ పుస్తకం గురించి నేను చేయని ప్రయత్నం లేదు. ఈ పుస్తకంలో 2 పద్యాలలో రామాయణం మొత్తం చెప్పారు కవి! భానువంశమునందు... అంటూ సాగే ఆ పద్యాలను మా అమ్మ గోదావరి స్నానం ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చే దారిలో శ్రావ్యంగా పాడడం నాకింకా వినిపిస్తూ నే ఉంటుంది. Thanks for recalling my memories!!🙏🙏🙏
నా చిరకాల కోరిక మీ ద్వారర తీరింది కృతార్థుడను. నమస్సుమాంజలులు. బానువంశమునందు ... పద్యం నా ప్రాణం! మా అమ్మ జ్ఙాపకం!
నా చిరకాల కోరిక మీ ద్వారర తీరింది కృతార్థుడను. నమస్సుమాంజలులు. బానువంశమునందు ... పద్యం నా ప్రాణం! మా అమ్మ జ్ఙాపకం!
https://www.blogger.com/profile/12474743240990103151 గారూ మీకు ఆ శ్రీరామ చంద్రమూర్తి అనుగ్రహం ఉంది. మీ ప్రయత్నం తప్పక నెరవేర గలదు. నా స్పందనలో ఆలస్యమునకు మన్నింతురు గాక. నమస్సులు.
https://www.blogger.com/profile/12474743240990103151 గారూ మీకు ఆ శ్రీరామ చంద్రమూర్తి అనుగ్రహం ఉంది. మీ ప్రయత్నం తప్పక నెరవేర గలదు. నా స్పందనలో ఆలస్యమునకు మన్నింతురు గాక. నమస్సులు.
Bapu గారూ నమస్సులు. శ్రీ రామ తారక శతకం మీ కంత ఆనందాన్ని కలిగించి నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అమ్మ గారు, మా అమ్మగారు ధన్యులు. మీరు కూడా ధన్యులు, అదృష్టవంతులు. మీకు ఆ శ్రీ రామచంద్రుని ఆశీస్సులు ఎల్లపుడూ ఉంటాయి.
Chalarojulanundi ee shatakam gurinchi vethukuchunna mee blog lo dorikindi chala santhosham kaligindi ...namaskaramulu
అయ్యా..
భాగేశ్వరీ రాగంలో రామునిపై పద్యం చేయాలని శోధిస్తుండగా మీ రామ తారక శతకం లభించింది,
ధన్యున్ని..
నేను పుస్తకం రూపంలో ముద్రించి అందరికి చేరేలా
నా చిన్ని ప్రయత్నంగా కృషి చేసి రాములవారి
కృపకు పాత్రులుగా నిలుస్తాను
అన్నగారూ నావద్ద 1926 లో వావిళ్ళ వారు ముద్రించిన పిడిఎఫ్ ఉంది అందు 99 పద్యములే ఉన్నవి.
పూర్వ జన్మ సుకృతం వుంటేనే కవిత్వం వ్రాయగలరు.
మా అమ్మగారు ఈ పుస్తకాన్ని చిన్నప్పుడే చదివారు. కాని, తరువాత ఈ పుస్తకం కోసం వెతికినప్పుడు ఎక్కడ దొరకలేదు. దీనికోసం ఇంటర్నెట్లో వెతికినప్పుడు శ్రీ విశ్వనాథ్ రెడ్డి గారి ద్వారా ఈ పుస్తకం సేకరించాము. వారికి మా ధన్యవాదాలు. ఈ పద్యాలనూ వీడియో రూపం లో అందజేసినవారికి కూడా మా ధన్యవాదాలు. ఈ కాపీలను మా బంధువులందరికి పంచడం జరిగినది. మీకు కూడా ఈ 100 శ్లోకాల pdf రూపంలో ఉన్న పుస్తకం కావాల్సినవారు ఈ నెం. 9010453838 కి సంప్రదించండి.
ఈ రామతారక శతకం PDF copy మనకు ఆర్కీవ్ సైటు నుండి దిగుమతి చేసుకోవటానికి అందుబాటులో ఉంది.
మీరు https://ia601507.us.archive.org/23/items/in.ernet.dli.2015.331985/2015.331985.Raamataaraka-Shatakamu.pdf అన్న లింక్ ద్వారా సులభంగా దిగుమతి చేసుకొని చదువుకొని ఆనందించగలరు.
Post a Comment