నేడు మహాలయంపు మహనీయ సుదర్శ, ధరాతలమ్మునన్
కూడుదు రెల్ల మానవులకున్నపవర్గము గొన్న పెద్ద లీ
నాడు, తరింప జేయుటకునై తమ సంతున కిచ్చి దీవెనల్,
గాఢపు భక్తితో గొలువగా నగు వారల శ్రాద్ధ కర్మలన్.
శ్రాద్ధము జేయ మంచిదగు, సాధ్యము కానిది యైన, లేక స
న్నద్ధులు కానిచో, పితృ గణాల క్షమాపణ గోరి యర్హులున్
శ్రద్ధను తర్పణమ్ము లపరాహ్నపు వేళ చరించ నూవులన్
పెద్దలు మేలు మేలనుచు స్వీకృతి చేసి శుభంబు గూర్తురే.
No comments:
Post a Comment