శ్రీ దూర్వాస మహర్షి విరచిత దేవీ (త్రిపురా) మహిమ్న స్తోత్రము నుండి\
వివరణ : బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు
***
ఉద్యత్పూర్ణ కళానిధి ప్రవదనం భక్తప్రసన్నం సదా
సంఫుల్లాంబుజపత్రకాంతి సుషుమా ధిక్కార దక్షేక్షణం
సానందం కృతమందహాసమసకృత్ప్రాదుర్భవత్కౌతుకం
కుందాకార సుదంత పంక్తి శశిభాపూర్ణం స్మరామ్యంబికే.
***
ఓ తల్లీ! ఉదయిస్తున్న పూర్ణ చంద్రుని శోభతో భక్తులపట్ల ప్రసన్నతతో, నిత్యమూ సంపూర్ణముగా వికసించిన పద్మముల రేకుల యొక్క శోభను ధిక్కరించగలిగి ప్రకాశిస్తున్న రమ్యమైన నేత్రములతో, జ్ఞానానందముతో కూడిన ప్రసన్నమై, మల్లెమొగ్గలవలె ఉన్న పలువరుసనుండి వెలువడే వెన్నెల వలె తెల్లగా ప్రకాశిస్తున్న చిరునవ్వుతో కూడిన నీ వదనమునకు నమస్కరించుచున్నాను. (దరస్మేర ముఖామ్బుజా).
***
ఉదయేందు ద్యుతి శోభనం, బతి కృపోత్కృష్టంబు, భక్తాళికిన్
ముదమున్నిత్యము, పూర్ణమై విరియు నంభోజాతపత్రప్రభన్
పదటుం జేయగ జాలు నేత్రయుతమున్, బ్రహ్మానుమోదార్హమున్,
హృదయోత్పాద నిరంతరాగ్ర హసితాహృష్టమ్ము, కుందాకృతీ
రదనశ్వేత ప్రకాశ పూర్ణమును నీ రమ్యాస్యమున్ దల్చెదన్.
No comments:
Post a Comment