ముని యిచ్చిన వరమును తన
చిన తనపుం జాపలమున జేయగ పరిశీ-
లనమును బిల్చెను కుంతి ర-
విని, భాస్కరుడిచ్చి పోయె బిడ్డ నతివకున్.
బిడ్డను గని భయమున రా-
బిడ్దొక మందసము నందు పెట్టెను వానిన్
అడ్డుపడ మాతృ హృదయము
చెడ్డది నీతల్లి యనుచు చేరెను నదికిన్.
పెట్టెను బాలుని తోడను
గట్టిగ బిగబట్టి గుండె కన్నియ నదిలో
నెట్టన విడువం బెట్టెను
చట్టున వెనుదిరిగె తల్లి చంచల మతియై.
No comments:
Post a Comment