padyam-hrudyam

kavitvam

Wednesday, October 24, 2012

చిన్మయ రూపిణీ !

 


  
కరముల నీ పదార్చనలు, కన్నుల నీదగు దివ్య రూపము-
న్నరయుటలున్, ముఖమ్మున భవాబ్ధిని దాటగ నావయైన నీ
వర గుణ వర్ణనల్ సలుపు భాగ్యము పొందిన పుణ్యమూర్తులన్
చరణము లంటి మ్రొక్కినను చాలదె చిన్మయ రూపిణీ! శివా!

2 comments:

SD said...

>> చరణము లంటి మ్రొక్కినను చాలదె చిన్మయ రూపిణీ! శివా!

మేష్టారు
మీకు చెప్పేటంతటి వాణ్ణి కాదు, నాకు తెలుగు అంత సరిగ్గా రాదు, ఛందస్సూ తెలీదు కానీ నాలుగో పాదం ఇలా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఛందస్సు ప్రకారం కుదురుతుందా?

చరణము లంటి మ్రొక్కినను చాలదె శివా చిన్మయ రూపిణీ!

మిస్సన్న said...

DG గారూ స్వాగతం. మీ సహృదయతకూ మనోజ్ఞమైన మీ భక్తి భావానికీ జోతలు. అలా మార్చితే గణాలు కుదరడం కష్టమండీ. శివానుగ్రహం మీపై కురియాలని ఆకాంక్షిస్తున్నాను. భవదీయుడు.