పద్మిని! పద్మనాభసతి! పాపవిమోచని! పద్మవాసినీ!
పద్మకరీ! ప్రసన్నకర భాండజలార్చిత! పద్మలోచనీ!
పద్మముఖీ! పరేశ్వరి! సువర్ణమయీ! నవపద్మ గంధినీ!
పద్మజ! శారదాగిరిజ భవ్య సుపూజిత పాదపంకజా!
శ్రీదేవీ! హరిమానసాబ్జ నిలయా! క్షీరాబ్ధి సత్పుత్రికా!
వేదాంగాది సమస్త వాఙ్మయ నుతా! విశ్వాఖిల వ్యాపకా!
హే! దారిద్ర్య విమోచనీ! శుభకరీ! హ్రీం మంత్ర బీజాత్మికా!
మోదంబౌ నవరాత్రివేళ జననీ! పూజింప నిన్ భక్తితో!
2 comments:
సాహితీ మిత్రులు మిస్సన్న గారూ! మీ పద్యములు చక్కని చిక్కని పదబంధములతో, భక్తిభావనలతో నలరారుచున్నవి. అభినందనలు!
మధుసూదన కవి మిత్రమా! ధన్యవాదములు.
Post a Comment