లోక గురవే నమ:
ఆయుష్షు జారెడు ననుదినమ్మును జూడ
...............కవ్వించి మాయమౌ యవ్వనమ్ము!
పోయిన దినములు పోవు మరలి రావు
...............కబళించు లోకమున్ కాల మెపుడు!
భంగ తరంగముల్ క్రుంగెడు రీతిని
................చంచలమౌ సిరి సంపదలును!
మెరుపు తీగె యనంగ మురిపించి మాయమౌ
................నీవిడి నట్టి నా జీవితమ్ము!
శరణమని పట్టితిని నీదు చరణములను
గాన శంకరా! నాయందు కరుణ జూపి
నాకు చేయూత నిమ్ము పినాక పాణి!
విడచి పెట్టక యేలుకో! విశ్వనాథ!
No comments:
Post a Comment