పసుల కాపరి వీవు పసు పతియును నీవు
..................పసు లక్షణమ్ముల మసల నీకు.
శిఖి పింఛ మౌళివి శిఖ పట్టుకొని నీవు
.................చెడు దారి బోకుండ శిక్ష నిమ్ము.
వేణుగాన విలోల వేవేల రాగముల్
.................నీవి గానివి జేర నీకు నన్ను.
గోపాల బాలకా గోపాలురను వోలె
.................చెలిమి నీతోడను చేయ నిమ్ము.
యమున యొడ్డున పున్నమి యామిని నను
నీదు చెంతను పులకింప నిమ్ము కృష్ణ!
మధుర బృందావనీ సీమ మధుపముగను
పుట్టి నీ పాద పద్మాల మురియ నిమ్ము.
2 comments:
పాద పద్మాలు .. మధుపము చక్కని భావన. మొత్తం పద్యం నిజంగా హృద్యం.. అభినందనలు.
Post a Comment