ఆది గురువున కభివందనములతో......................
యవ్వనమ్మున నన్ను విషాహు లైదు
మర్మ సంధుల గఱచుట మాసి పోయె
తెలివి ! పుత్రుల, సిరులను, స్త్రీల బొంది
తగని సంసార సుఖముల తగిలి యుంటి.
అంతమే లేని మాన గర్వాంధత బడి
యెదను నీ చింత తోపలే దింత యైన
నేర మొనరించితిని శివా! నేర నైతి
తప్పు మన్నించు శంకరా! దయను జూడు.
2 comments:
తాత్పర్యం, కొన్ని కఠిన పదాలకి అర్ధం కింద ఇస్తే నా లాంటి భాషపై పట్టు పూర్తిగా లేని వాళ్ళకి పూర్తిగా అర్ధమవుతుంది
శర్మ గారూ! స్వాగతం. మీ ఆసక్తికి ధన్యవాదాలు.
భావం: యవ్వనంలో ఉన్నప్పుడు అయిదు ఇంద్రియాలు (కన్ను, ముక్కు, నోరు, చెవి, స్పర్శ)
అయిదు విష సర్పాలై నా ఆయువు పట్లమీద కాటు వేస్తూ ఉండడం చేత నా వివేకం
నశించి పోయి సంసార సుఖాల్లో మునిగి తేలుతూ ఉండి పోయాను.
అంతు లేని అభిమాన గర్వాలు నన్ను గ్రుడ్డి వానిగా మార్చి వేసాయి.
దాంతో నా మనస్సులో నిన్ను గూర్చిన చింతనే లేక పోయింది.
నేరం చేసాను శంకరా! దయతో నా తప్పు మన్నించి నన్ను క్షమించు.
Post a Comment