padyam-hrudyam

kavitvam

Friday, November 30, 2012

త్రిగుణములకు నతీతు నిన్ దెలియ కుంటి.........







శంకరాచార్య స్వామినే నమ:

హృద్యుడవు వేద వేదాంత వేద్యు డవును
హృదయ పద్మాల వెల్గుల నీను హరివి
శాంత చిత్తుండ నిత్యుడ సత్య మూర్తి
వివిధ మునిజన హృదయాబ్జ వేద్యుడీవు !

స్వప్న జాగ్ర త్సుషుప్త్య వస్థలకు పరుడ
త్రిగుణములకు నతీతు నిన్ దెలియ కుంటి
దురితమును జేసి యుంటిని దుష్ట మతిని
నన్ను క్షమియించు శంకరా! నన్ను గావు.

2 comments:

కమనీయం said...



పద్యాలు రెండూ బాగానేఉన్నవి.అంతకన్నా శివుని చిత్రం బాగుంది.చందోవ్యాకరణాల్ని పాటించి రాసారు కాబట్టి చెప్పవలసివస్తున్నది.వేదవేద్యుడున్ను అనటం తప్పు.వేద్యుడును అంటే గణం సరిపోదు కాబట్టి 'వేద్యుడీవు ' అంటేసరిపోతుంది.

మిస్సన్న said...

కమనీయం గారూ స్వాగతం. మీరు నా బ్లాగును దర్శించడం చాలా సంతోషాన్నిచ్చింది.
మీ సూచన శిరోధార్యం. పద్యాలను సవరించుతున్నాను.