శ్రీ శంకరులకు ప్రణామములతో......
స్వామి నగ్నుడ వీవు! నిస్సంగుడవును!
త్రిగుణ రహితుడ వీవు! నీ దృష్టి యెపుడు
నిల్చు నాసాగ్ర మందున! నీవు మోహ-
తమ మెరుంగవు! భవమందు తపన లేదు!
మంద బుద్ధినై యున్మత్త మతిని యగుచు
నిన్ను స్మరియింప కుంటిని నిత్య మకట
నన్ను మన్నించు శంకరా! నాదు తప్పు
గాచి రక్షించు దయతోడ కాల కాల!
No comments:
Post a Comment