శ్రీ జగద్గురవే నమః
వేకువను లేచి నీ యభిషేకమునకు
స్నానమొనరించి తేనైతి చల్లనైన
గంగ నీటిని, పూజకై కఱవు దీర
బిల్వ దళములు తేనైతి, కల్వ పూల,
పరిమళమ్ముల వెదజల్లు సరసిజముల,
గంధ ధూపాల తేనైతి బంధురముగ
శివ శివా! నన్ను మన్నించు చేసినాడ
తప్పు! క్షమియించు శంకరా! దయను జూడు.
No comments:
Post a Comment