ఆది గురవే నమః.
పెరుగు తేనెను నెయ్యయు బెల్లములను
పాల నభిషేక మొనరింప జాలనైతి
చందనము పూయలేనైతి చల్లగాను
స్వర్ణ పుష్పాలు ధూపదీపాలు లేవు.
వివిధ భక్ష్యమ్ములను దెచ్చి విరివిగాను
నీకు నైవేద్య మిడకుంటి నీలకంఠ !
నన్ను క్షమియించు శంకరా! నతులు నీకు
తప్పు మన్నించు కాపాడు దండము లివె.
No comments:
Post a Comment