"రాకు - పోకు - తేకు - మేకు" ఈ పదాలను ఉపయోగించి భారతార్థంలోపద్యం చెప్పాలి .
రాకుమారుల మధ్య స్పర్థలు రాజ్యలక్ష్మికి చేటగున్
పోకు పోరుకు నాశనమ్మగు పొందు మేలు సుయోధనా
తేకు మచ్చను తొల్లి పెద్దల దివ్య కీర్తికి పాపమౌ
మేకువై మన వంశ కుడ్యపు మేలు బాపకు మూర్ఖతన్.
No comments:
Post a Comment