padyam-hrudyam

kavitvam

Thursday, September 1, 2011

చిన్మయ రూపిణీ !


ధర్మ పథమ్ము వీడి, పర తత్త్వ మెఱుంగక, నైహికమ్ములౌ
శర్మపు జాలముం దగిలి, శాశ్వత మీ తనువంచు నెంచి, దు-
ష్కర్మము లాచరించుదురు, కాని, భవాంఘ్రి సరోజ చింత స-
త్కర్మ నొనర్ప బూనరు గదా ప్రజ! చిన్మయ రూపిణీ ! కటా!

4 comments:

కంది శంకరయ్య said...

అద్భుతమైన పద్యం. ‘భవాంఘ్రి సరోజ చింత స-
త్కర్మ నొనర్ప బూనరు గదా’ అనడం బాగుంది.

మిస్సన్న said...

గురువుగారూ!
ధన్యుడ నైతిని. ధన్యవాదములు.

Rao S Lakkaraju said...

ధర్మ పథమ్ము వీడి, పర తత్త్వ మెఱుంగక, నైహికమ్ములౌ
శర్మపు జాలముం దగిలి,
----------------------
మిస్సన్న గారూ చాలా బాగుంది పద్యం.

మిస్సన్న said...

లక్కరాజు వారూ! చిన్మయ రూపిణి నచ్చినందుకు ధన్య వాదాలండీ.