పద్యము తెలుగుల విద్యగు! హృద్యము చదువరుల కెన్న, నింపగు వినగా ! పద్యము కవితల కాద్యము! సద్యశమును కల్గజేయు చక్కగ కవికిన్!
padyam-hrudyam
kavitvam
Wednesday, August 31, 2011
వినాయకా నిను వినా .........
చేత వేడి కుడుము,చెన్నొందు పూమాల,
ఎలుక వాహనమ్ము, యేన్గు మొగము,
పెద్ద చెవులు, బొజ్జ, పెరికిన దంతమ్ము
విఘ్నరాజ! నీకు వేయి నతులు.
కమ్మని యుండ్రములను తిని
యిమ్ముగ తిరుగాడ భూమి, నిమ్మని చందా
గమ్మున మూగిన భక్త జ-
నమ్ముల గని జారుకొను వినాయకు దలతున్!
" ఎంత కాల మిటుల నీ వెట్టి చాకిరీ ?
మోయలేను నిన్ను పోదు స్వామి! "
అన్న ఎలుక ముందు నిన్ని యుండ్రము లుంచి
బుజ్జగించు దేవు బుద్ధి గొలుతు!
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
మిస్సన్న గారూ ! నేటి 'చందా' మామలకు భయపడిన వినాయకుని బాగా చూపించారండీ !
చిత్ర మేమిటంటే ఈ రోజు చంద మామను చూస్తే అపనిందలు, 'చందా' మామను (సరిగా డబ్బిచ్చి) చూడక పోతే నిందలు. హత విధీ !
హుమచ్చాస్త్రి గారూ బాగా చెప్పేరు. ధన్యవాదాలు.
ఆనంద స్వరూపుడు, హాస్య ప్రియుడు అయిన గణపతికి హాస్యనీరాజనం...సందర్భోచితం అయిన పద్యాలు
నిజంగా హృద్యాలు...
Post a Comment