padyam-hrudyam

kavitvam

Friday, August 19, 2011

చిన్మయ రూపిణీ !


విరులన్ సౌరభమై, ఫలాల రుచివై, విశ్వమ్మునన్ భ్రాంతివై ,
ఝరులన్ వేగమవై , మొయిళ్ల మెరుపై , చైతన్యమై జీవులన్ ,
గిరులన్ నిబ్బరమై , యెడంద దయవై, క్రీడింతు వీ వెల్లెడన్
సిరివై! చిన్మయ రూపిణీ! స్మిత ముఖీ! శ్రీ రాజ రాజేశ్వరీ!

2 comments:

డా. విష్ణు నందన్ said...

హృద్యమైన పద్యం . అనుకోకుండా చూడగలిగాను . మహానందం . మరొక్కసారి సావకాశం గా వ్యాఖ్యానించే సమయమూ , సౌలభ్యమూ కోసం అమ్మని ప్రార్థిస్తాను . చక్కని ధార మిస్సన్న గారూ !!!

మిస్సన్న said...

విష్ణునందన్ గారూ! నాపద్యం ధన్యమైంది. నా బ్లాగు ధన్యమైంది. నా జన్మ ధన్యమైంది.