padyam-hrudyam

kavitvam

Friday, August 5, 2011

చిన్మయ రూపిణీ !


ముగ్ధ మనోహరాకృతిని మోహమునన్ బడద్రోసి శంభునిన్,
దగ్ధము జేయ మన్మథుని, తండ్రివి గావవె యంచు వేడవే!
దుగ్ధము లాను నాడె పలు దుర్గుణముల్ ప్రభవించె నా మదిన్
దగ్ధము జేయ వేడగదె తండ్రిని చిన్మయ రూపిణీ ! శివా!

5 comments:

Rao S Lakkaraju said...

మిస్సన్న గారూ ఎంత మధురంగా చెప్పారు
"ముగ్ధ మనోహరాకృతిని మోహమునన్ బడద్రోసి శంభునిన్,"
వారెవ్వా

మిస్సన్న said...

లక్కరాజు వారూ ధన్యవాదాలు.
జనని చెప్పించిన మాటలవి.

హనుమంత రావు said...

అన్ని పద్యాలు చాలా బావున్నాయి..ఈరోజే నీ బ్లాగులోకి వచ్చాను. ఈ పద్యంలో "దుగ్ధములానునాడె....
పాదము మరీ బాగుంది.. దుర్మార్గపు ఆలోచనలు ముందు పుట్టాకనే మనం పుట్తున్నాము...నీ భావస్ఫూర్తి, పద్యాలఅల్లిక.. సెహభాష్.... చిన్మయరూపిణి అనుగ్రహం నీకు పూర్తిగా వుంది.

మిస్సన్న said...

అయ్యా హనుమంతరావు గారూ ధన్యుణ్ణి.

గోలి హనుమచ్చాస్త్రి said...

మిస్సన్న గారూ !ఈ రోజే మీ బ్లాగు చూచాను. చాలా బాగుంది.
అమ్మను జూచితిగా పలు
బొమ్మల లో నందముగను, పొంగితి గా ; ప
ద్యమ్ముల చిన్మయ రూపిణి
నిమ్ముగ నే గాంచి నాడ, నేడే యనఘా !