ఇనకులసోము పెండ్లి నిక నింపుగ జేయగ నుద్యమించు డన్
జనకుని సాదరోక్తులకు సమ్మతి దెల్పి వసిష్ఠుఁ డంత నా
ఘనులగు గాధినందనుని గౌతమపుత్రుని గూడి పెండ్లి వే
దిని దగ జేసి గంధ మిడి దివ్య సుమమ్ముల గూర్చి నంతటన్.
స్వర్ణపాలికలును సాంకురఛిద్రకుం
...........భములును మొలకలౌ భవ్యమైన
నవధాన్యములు గల నవ్యమౌ మూకుడుల్
...........ధూపయుక్తములైన దోహనులును
శంఖపాత్రలు నర్ఘ్య జలపాత్రలును స్రుక్స్రు
...........వమ్ములు పేలాల పాత్రములును
పచ్చని యక్షతల్ పరచిన దర్భలు
...........విధ్యుక్త మంత్రముల్ వేదవిదులు
శాస్త్ర విహితమౌ మంత్రసంజనితమైన
యగ్ని గొనిరాగ తేజస్వియౌ వసిష్ఠుఁ
డనలమును వ్రేల్చ నత్తరి జనకవిభుడు
తీసికొని వచ్చె సుతను వేదికకు తాను. 1
సర్వభూషణభూషిత జనకపుత్రి
నగ్ని మ్రోలను శ్రీరాఘ వాభిముఖిగ
జేసి యాసీన నా తండ్రి చెప్పెను కని
రామచంద్రుని కౌసల్య ప్రేమసుతుని.
ఈమె సీత నా కొమరిత రామచంద్ర
నీకు సహధర్మచారిణి నేటి నుండి
స్వీకరింపుము పాణిని ప్రేమతోడ
భద్ర మగు నీకు చేబట్ట పడతి గాను.
ఈమె పతివ్రత పావని
నీమముతో ననుసరించు నిత్యము నీడై
రామా నిన్నని జనకుం
డా మంత్రజలమ్ము వోసె నానందముగా. 2
బాగనిరి సురలు మునులును
మ్రోగిన వా దేవదుందుభులు పుష్పమ్ముల్
ప్రోగులుగ రాలె వానై
యీగతి నద్భుతము లలరె నెల్లెడ నంతన్.
సీతాకన్యాదానము
ప్రీతిని నొనరించి జనక విభు డరుసముతో
చేతము పొంగగ రాముని
భ్రాతలతో బలికె నిట్లు పరిణయ వేళన్.
రమ్ము లక్ష్మణా యూర్మిళారమణి యీమె
స్వీకరింపుము శుభమగు చేయి బట్టి
భరత మాండవీలలనను బడయు మయ్య
నీవు శత్రుఘ్న శ్రుతకీర్తి నెన్ను మయ్య. 3
సౌమ్యులు సచ్చరిత్రులును సంతతము న్నియమోప జీవనుల్
రమ్య వధూమణుల్ తనర రాజిలు డంచు విదేహు డన్న నౌ
పమ్యము గానరాని గతి భ్రాతలు నల్వురు పెండ్లికూతులన్
కామ్యము లందు భాగినులగా కరముల్ గ్రహియించి వేడ్కతో....
అగ్నిహోత్రమునకు నంకపాళికి జన
కునకు ఋషుల కెల్ల వినయమొప్ప
దండముల నిడుచు ప్రదక్షిణములు జేసి
దీవనలను పొంద దివ్యముగను. 4
పిదప శాస్త్రోక్తరీతిలో పెండ్లి తంతు
జరిగి నల్వురు సోదరుల్ తరుణుల గొన
పూలవానలు కురిసెను బైలునుండి
దేవదుందుభు లాయెను దివ్యముగను.
వీణా వేణు మృదంగ తాళములతో విన్పించె సంగీతముల్
వీనుల్విందుగ నప్సరోగణములున్ విన్వీధిలో నాడగా
గానమ్ముల్ పొనరించినారు తమితో గంధర్వులున్ కమ్మగా
నా నాడా రఘువంశసోదరుల కల్యాణంబు కన్విందుగా. 5
ప్రవేశయామాస సుతాన్ సర్వానృషిగణానపి |
తతో రాజా విదేహానాం వసిష్ఠమిదమబ్రవీత్ || ౧-౭౩-౧౮
కారయస్వ ఋషే సర్వమృషిభిః సహ ధార్మిక |
రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం ప్రభో || ౧-౭౩-౧౯
తథేత్యుక్త్వా తు జనకం వసిష్ఠో భగవానృషిః |
విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికమ్ || ౧-౭౩-౨౦
ప్రపామధ్యే తు విధివత్వేదిం కృత్వా మహాతపాః |
అలఞ్చకార తాం వేదిం గంధపుష్పైస్సమన్తతః || ౧-౭౩-౨౧
సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుమ్భైశ్చ సాంకురైః |
అంకురాఢ్యైశ్శరావైశ్చ ధూపపాత్రైస్సధూపకైః || ౧-౭౩-౨౨
శంఖపాత్రై-స్స్రువై-స్స్రుగ్భిః పాత్రైరర్ఘ్యాభిపూరితైః |
లాజపూర్ణైశ్చ పాత్రీభిరక్షతైరభిసంస్కృతైః || ౧-౭౩-౨౩
దర్భైస్సమైస్సమాస్తీర్య విధివన్మంత్రపూర్వకమ్ |
అగ్నిమాదాయ వేద్యాం తు విధిమంత్రపురస్కృతమ్ || ౧-౭౩-౨౪
జుహావాగ్నౌ మహాతేజా వసిష్ఠో భగవానృషిః |
తతస్సీతాం సమానీయ సర్వాభరణభుషితామ్ || ౧-౭౩-౨౫ 1
సమక్షమగ్నేస్సంస్థాప్య రాఘవాభిముఖే తదా |
అబ్రవీజ్జనకో రాజా కౌసల్యానందవర్ధనమ్ || ౧-౭౩-౨౬
ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ |
ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా || ౧-౭౩-౨౭
పతివ్రతా మహభాగా ఛాయేవానుగతా సదా |
ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రపూతం జలం తదా || ౧-౭౩-౨౮ 2
సాధు సాధ్వితి దేవానామృషీణాం వదతాం తదా |
దేవదున్దుభిర్నిర్ఘోషః పుష్పవర్షో మహానభూత్ || ౧-౭౩-౨౯
ఏవం దత్త్వా తదా సీతాం మంత్రోదకపురస్కృతామ్ |
అబ్రవీజ్జనకో రాజా హర్షేణాభిపరిప్లుతః || ౧-౭౩-౩౦
లక్ష్మణాగచ్ఛ భద్రం తే ఊర్మిలాముద్యతాం మయా |
ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వ మాభూత్కాలస్య పర్యయః || ౧-౭౩-౩౧
తమేవముక్త్వా జనకో భరతం చాభ్యభాషత |
గృహాణ పాణిం మాండవ్యాః పాణినా రఘునందన || ౧-౭౩-౩౨
శత్రుఘ్నం చాపి ధర్మాత్మా అబ్రవీజ్జనకేశ్వరః |
శ్రుతకీర్త్యా మహాబాహో పాణిం గృహ్ణీష్వ పాణినా || ౧-౭౩-౩౩ 3
సర్వే భవంతస్సౌమ్యాశ్చ సర్వే సుచరితవ్రతాః |
పత్నీభిస్సంతు కాకుత్స్థా మాభూత్కాలస్య పర్యయః || ౧-౭౩-౩౪
జనకస్య వచశ్శృత్వా పాణీన్ పాణిభిరాస్పృశన్ |
చత్వారస్తే చతసృణాం వసిష్ఠస్య మతే స్థితాః || ౧-౭౩-౩౫
అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజానమేవ చ |
ఋషీంశ్చైవ మహాత్మానస్సభార్యా రఘుసత్తమాః || ౧-౭౩-౩౬ 4
యథోక్తేన తథా చక్రుర్వివాహం విధిపూర్వకమ్ |
కాకుత్స్థైశ్చ గృహీతేషు లలితేషు చ పాణిషు || ౧-౭౩-౩౭
పుష్పవృష్టిర్మహత్యాసీ-దంతరిక్షాత్సుభాస్వరా |
దివ్యదున్దుభినిర్ఘోషై-ర్గీతవాదిత్రనిస్వనైః || ౧-౭౩-౩౮
ననృతుశ్చాప్సరస్సంఘా గంధర్వాశ్చ జగుః కలమ్ |
వివాహే రఘుముఖ్యానాం తదద్భుతమదృశ్యత || ౧-౭౩-౩౯
ఈదృశే వర్తమానే తు తూర్యోద్ఘుష్టనినాదితే |
త్రిరగ్నిం తే పరిక్రమ్య ఊహుర్భార్యాం మహౌజసః || ౧-౭౩-౪౦
అథోపకార్యాం జగ్ముస్తే సభార్యా రఘునందనాః |
రాజాఽప్యనుయయౌ పశ్యంత్సర్షిసంఘ-స్సబాంధవః || ౧-౭౩-౪౧ 5
No comments:
Post a Comment