దత్తపది:
చరణము, భరణము, వరణము, తరుణము - ఈ పదాలనుపయోగించి భారాతార్థంలో
పద్యం వ్రాయాలి.
నా పద్యం:
రాజసూయ యాగం సందర్భంలో అగ్రపూజకు శ్రీకృష్ణుడే తగిన వాడని భీష్మ పితామహుడు పల్కిన పలుకులు:
చరణము పాప భంజనికి జన్మము నిచ్చిన చోటు! కౌస్తుభా-
భరణము నీడ యా కమల వాసిని కింపగు తావు! కుక్షి యా-
వరణము సర్వ సృష్టికిని! వందిత వేదుని, గృష్ణు తొల్త నీ
తరుణము నందు గొల్చుటలు ధర్మము నీకగు ధర్మ నందనా!

No comments:
Post a Comment