padyam-hrudyam

kavitvam

Thursday, January 3, 2013

సరసాహ్లాదిని

సమస్య : 

చెలువుగ రామలక్ష్మణులు సీతకుఁ దమ్ములు శంభుఁ డన్నయున్.
===========================================

పూరణలు:

1.  చెలువుడ! కోరికాయె మది చెప్పవొ రాముని గాధ యన్న నీ
     పలుకుల కేమి చెప్పగల వాడ సఖీ! బహుశా యిలా స్థలిన్
     చెలువుగ రామలక్ష్మణులు సీతకు తమ్ములు, శంభుడన్నయున్
     కలియుగమందు రక్కసుల కట్టడి చేసిరి యంచు పల్కితిన్.!!!!!


2.  పలువుర జేరదీసి తన ప్రజ్ఞను  చాటెను దంబుడిట్లహో
     చెలువుగ రామలక్ష్మణులు సీతకు దమ్ములు, శంభుడన్నయున్
     చిలకలకొల్కి రాధకగు, చెప్పెదనింకను, బ్రహ్మగారికిన్
     నలదమయన్తులిర్వురును నమ్మిన బంటులు వాణి తల్లియౌ.

No comments: