padyam-hrudyam

kavitvam

Tuesday, January 1, 2013

మనసు దోచెడు నేటి హేమంత శోభ!





ప్రకృతి పురుషుల శుభకర పరిణయాన
మంచుముత్తెపు సేసల మరల మరల
తలల నిడుకొని మురిసిన తరుణ మట్లు
మనసు దోచెడు నేటి హేమంత శోభ!

పచ్చ పచ్చని యాకు తివాచి పైన
వారి   తలలపై క్రిందకు జారి పడిన 
తెల్ల తెల్ల  తలంబ్రాల కుల్ల మలరి
మల్లె మొల్లలు నవ్వె! నా యుల్లమలరె!


No comments: