చాలని తల్పబోకుడిది ఛత్రము వోలెను గాచు మిమ్ము, నా
కేలది యల్లలాడ, దిక కీడది వట్టిది! రాళ్ళవాన గో-
పాలుర పాలి ధూళికణ పాతమగున్! చనుదెంచు డందరున్.
గోవర్ధనగిరి గొడుగుగ
భావింతుము గోపబాల! పరమ దయాళూ!
దైవమవై మా యండను
నీవుండగ మాకు కీడె? నీరజనాభా!
అన్య చింత మాని యా పరంధాముని
నెవడు నమ్ము కొనునొ యిహమునందు
నట్టి వాని క్షేమ మాతడె వహియించు
ననుట కిది నిదర్శనమ్ము గాదె!
No comments:
Post a Comment