padyam-hrudyam

kavitvam

Tuesday, May 1, 2012

చిన్మయ రూపిణీ !


 



క్రుంకుచు నుండె నా మనసు గూటను  జ్ఞానపు దివ్వె అయ్యొ న-
ల్వంకల నుండి లోనగల వైరి తమస్సులు ముట్టడింప నీ 
సంకట మార్ప వేడెదను  సన్నుతి జేతు త్వదంఘ్రి యుగ్మమున్ 
శాంకరి! శైలజా! దివిజ సన్నుత! చిన్మయ రూపిణీ! శివా!

4 comments:

కంది శంకరయ్య said...

చిన్మయరూపిణిని సంబోధిస్తూ చక్కని పద్యాలు వ్రాస్తున్నారు. అభినందనలు.
‘క్రుంకుచునుండె’ అనాలనుకుంటా....

vsnmhari said...

ఆర్యా!
మిస్సన్న గారూ!
నమస్కారం. చిన్మయరూపిణిని సంబోధిస్తూ వ్రాసిన పద్యం బాగుంది. ఐతే "భవాంఘ్రియుగ్మమున్" - బహుశ: భవదంఘ్రియుగ్మమున్ అని ఉండాలనుకుంటా. అలాగైతే గణదోషం. త్వదంఘ్రి లేదా తవాంఘ్రి అనాలేమో చూడండి.
ధన్యవాదాలు.

ఏల్చూరి మురళీధరరావు said...

క్రుంకుచు నుండె నా మనసు గూటను జ్ఞానపు దివ్వె; అయ్యొ! న
ల్వంకలనుండి లోనఁ గల వైరితమస్సులు ముట్టడింప నీ
సంకట మార్ప వేడెదను; సన్నుతి జేతుఁ ద్వదంఘ్రియుగ్మమున్
శాంకరి! శైలజా! దివిజసన్నుత! చిన్మయరూపిణీ! శివా!

భవతు !

మిస్సన్న said...

శంకరయ్య గారూ ధన్యవాదాలు. మీరు సూచించిన సవరణ చేశాను.

మూర్తిగారూ నా బ్లాగును దర్శించినందుకు ధన్యవాదాలు. మీ సూచనలు ఆమోదయోగ్యం.

డా.ఏల్చూరి మురళీధర రావు గారూ! మీ స్పర్శతో నా బ్లాగు పులకించింది. మీరు సంస్కరించిన పద్యాన్ని ప్రచురించాను. ధన్యావాదాలండీ.