padyam-hrudyam

kavitvam

Friday, April 6, 2012

చిన్మయ రూపిణీ !


వెలుగులరేడు నీ ప్రభల వేడక వెల్గుట సాధ్యమౌనె ? తా-
రలు భవదీయ దంత రుచిరమ్ముల గోరక తళ్కు లీనునే ?
వెలుగుల కెల్ల వెల్గువయి వెల్గెడు పెద్ద వెలుంగు తల్లి ! నా
తలపుల వెల్గ వేడెద సతమ్మును చిన్మయ రూపిణీ ! కృపన్.

No comments: