పద్యము తెలుగుల విద్యగు! హృద్యము చదువరుల కెన్న, నింపగు వినగా ! పద్యము కవితల కాద్యము! సద్యశమును కల్గజేయు చక్కగ కవికిన్!
చిన్మయరూపిణిని సంబోధిస్తూ చక్కని పద్యాలు వ్రాస్తున్నారు. అభినందనలు.‘క్రుంకుచునుండె’ అనాలనుకుంటా....
ఆర్యా!మిస్సన్న గారూ!నమస్కారం. చిన్మయరూపిణిని సంబోధిస్తూ వ్రాసిన పద్యం బాగుంది. ఐతే "భవాంఘ్రియుగ్మమున్" - బహుశ: భవదంఘ్రియుగ్మమున్ అని ఉండాలనుకుంటా. అలాగైతే గణదోషం. త్వదంఘ్రి లేదా తవాంఘ్రి అనాలేమో చూడండి. ధన్యవాదాలు.
క్రుంకుచు నుండె నా మనసు గూటను జ్ఞానపు దివ్వె; అయ్యొ! న ల్వంకలనుండి లోనఁ గల వైరితమస్సులు ముట్టడింప నీ సంకట మార్ప వేడెదను; సన్నుతి జేతుఁ ద్వదంఘ్రియుగ్మమున్ శాంకరి! శైలజా! దివిజసన్నుత! చిన్మయరూపిణీ! శివా! భవతు !
శంకరయ్య గారూ ధన్యవాదాలు. మీరు సూచించిన సవరణ చేశాను.మూర్తిగారూ నా బ్లాగును దర్శించినందుకు ధన్యవాదాలు. మీ సూచనలు ఆమోదయోగ్యం.డా.ఏల్చూరి మురళీధర రావు గారూ! మీ స్పర్శతో నా బ్లాగు పులకించింది. మీరు సంస్కరించిన పద్యాన్ని ప్రచురించాను. ధన్యావాదాలండీ.
Post a Comment
4 comments:
చిన్మయరూపిణిని సంబోధిస్తూ చక్కని పద్యాలు వ్రాస్తున్నారు. అభినందనలు.
‘క్రుంకుచునుండె’ అనాలనుకుంటా....
ఆర్యా!
మిస్సన్న గారూ!
నమస్కారం. చిన్మయరూపిణిని సంబోధిస్తూ వ్రాసిన పద్యం బాగుంది. ఐతే "భవాంఘ్రియుగ్మమున్" - బహుశ: భవదంఘ్రియుగ్మమున్ అని ఉండాలనుకుంటా. అలాగైతే గణదోషం. త్వదంఘ్రి లేదా తవాంఘ్రి అనాలేమో చూడండి.
ధన్యవాదాలు.
క్రుంకుచు నుండె నా మనసు గూటను జ్ఞానపు దివ్వె; అయ్యొ! న
ల్వంకలనుండి లోనఁ గల వైరితమస్సులు ముట్టడింప నీ
సంకట మార్ప వేడెదను; సన్నుతి జేతుఁ ద్వదంఘ్రియుగ్మమున్
శాంకరి! శైలజా! దివిజసన్నుత! చిన్మయరూపిణీ! శివా!
భవతు !
శంకరయ్య గారూ ధన్యవాదాలు. మీరు సూచించిన సవరణ చేశాను.
మూర్తిగారూ నా బ్లాగును దర్శించినందుకు ధన్యవాదాలు. మీ సూచనలు ఆమోదయోగ్యం.
డా.ఏల్చూరి మురళీధర రావు గారూ! మీ స్పర్శతో నా బ్లాగు పులకించింది. మీరు సంస్కరించిన పద్యాన్ని ప్రచురించాను. ధన్యావాదాలండీ.
Post a Comment