సిరికి నెచ్చెలికాడు సిరుల నిచ్చెడివాడు
.......నాడంబరమ్ముల కవలివాడు
పసుల గాచిన వాడు పసుల జంపెడు వాడు
........పసి బాల వృద్ధుల పాలివాడు
పిలుపు వినెడు వాడు పిలువక చనువాడు
.......పిలుపుల కందని చెలిమికాడు
చూచి చూడని వాడు చూచి కాచెడు వాడు
........చూపుల జిక్కని సొగసుకాడు
షడ్రసోపేతభక్ష్యసంచయము గాక
పత్రసుమముల ఫలజలార్పణల తనియు
పరమపురుషుడు రారాజు దరికి జనక
విదురు నింటికి చనుదెంచె విందు గుడువ.
No comments:
Post a Comment