చంపకారుణవర్ణ చంద్రభస్మాభుడు
........చారుధమ్మిల్లయు జటల యోగి
కస్తూరికుంకుమాఘనచర్చితాన్గయు
........శవభస్మలేపనస్థామనుండు
మదనసంజీవని మదనాన్తకుండును
........స్వర్ణకంకణహస్త సర్పకరుడు
ఝణఝణచ్ఛింజినీచారుపాదాబ్జయు
........ఫణిరాజమండితపదకమలుడు
వికచనీలోత్పలద్వంద్వవిమల నేత్ర
అరుణఫుల్లాబ్జనేత్రత్రయమ్మువాడు
హరిణదివ్యాంబరయును దిగంబరుండు
గౌరినిన్ విశ్వనాథుని కనగ ముదము.
No comments:
Post a Comment