పాడవే ఒకసారి ఓ మధుర మురళీ!
నేడు నా మది కోరె నీ దివ్య రవళీ........పాడవే...
నీ గాన లహరిలో నే మునిగి పోవాలి
హాయిగా నను నేను మైమరచి పోవాలి........పాడవే...
1. కల్హార ముకుళమౌ కన్నయ్య పెదవి పై
కమనీయ సుధ గ్రోలి కరగి పోయితివేమొ = కల్హార =
రాధమ్మ యెదలోన రాగాలు చివురించె
మాధవునికై విరహ బాధతో తపియించె......పాడవే...
2. నిండు పున్నమి రేయి పండు వెన్నెలలోన
యమునా నదీ తటిని యింపైన నీ పాట = నిండు =
తీయగా మ్రోగనీ, తీగలై సాగనీ,
అమృతమే కురియనీ, ఆమనై విరియనీ........పాడవే...
2 comments:
చాలా చాలా బాగుంది సర్ ఈ పాట...
అమ్మా శైలజ గారూ! స్వాగతం. నల్లనయ్య మురళీ గానం మీ 'ఊహల్లోని ఊసుల్లో' మనోజ్ఞమైన రాగాల్ని పలికించినందుకు చాలా సంతోషంగా ఉంది.
Post a Comment