padyam-hrudyam

kavitvam

Thursday, January 19, 2012

పసిదనాల జాలు




పట్టు పరికిణీయు, పాపట బొట్టును,
పూల జడయు, కుచ్చు, వాలు చూపు,
చిలిపి నవ్వు రువ్వు చిట్టి మైథిలి! మురి-
పాల పసి దనాల జాలు నువ్వు.

7 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

చిన్నారి మైథిలికి శ్రీరాముని దీవెనలన్నీ లభించాలి.

మిస్సన్న said...

మందాకిని గారూ ! మా మనుమరాలికి శ్రీ రామచంద్రుని దీవెనలందించిన మీకు శత ధన్యవాదాలు.

వెంకట రాజారావు . లక్కాకుల said...

తాత మనుమరాలు తగనొక్క పోలికే
నగవు జూడ మేని బిగువు జూడ
అన్న! మిస్సనార్య! చిన్నారి మైథిలి
సాయి కృపను పెరిగి హాయి గనును

వెంకట రాజారావు . లక్కాకుల said...
This comment has been removed by the author.
జ్యోతి said...

మైధిలికి దీవెనలు

మిస్సన్న said...

మిత్రమా రాజారావు గారూ బ్లాగును దర్శించినందుకు
ధన్యవాదాలండీ. మా మనుమరాలికి శ్రీ సాయి కృపను కోరినందుకు కృతజ్ఞతలండీ,

మిస్సన్న said...

అమ్మా జ్యోతిగారూ మా మనుమరాలిని దీవిన్చినందుకు ధన్యవాదాలు.