
ఉత్తరాయణ పుణ్యకాలోద్భవమున
మకర సంక్రాంతి పురుషుడు సకల జీవ
కోటి కిడుగాక శుభముల కోటి నుర్వి
ననుచు కాంక్షింతు మనసార ననఘులార.
రంగుగ రంగవల్లులను రాజిలు గొబ్బియలుంచి కన్నియల్
హంగగు పట్టు పుట్టముల నాడుచు పాడుచు పూజసేయుచున్
పొంగుచు పొంగలిన్ దినెడి పొల్పగు సంక్రమణంపు వేళలో
ముంగిలి పర్వ శోభలను మోదము గూర్చెడు నెల్లవారికిన్.
వందన మాచరింతు నపవర్గతృషీతుల కంజలించెదన్
ముందుగ మాకు నందరికి పూర్వులు పూజ్యులు భక్తి నా మదిన్
సందడి చేయగా మకర సంక్రమణంబున తర్పణంబులన్
పొందుగ నిచ్చి దీవెనల పొందెద వృద్ధిని పొంద సంపదల్
4 comments:
సంక్రాంతి శుభాకాంక్షలు
శ్రీ మిస్సన్న గారికి,
సంక్రాంతీ శుభాకాంక్షలండీ మాస్టారు మీకున్నూ
చీర్స్
జిలేబి.
సంక్రాంతి శుభాకాంక్షలు...
మాలా కుమార్ గారూ! జిలేబీ గారూ! లాస్య రామకృష్ణ గారూ! ధన్యవాదాలండీ. మీ కందరికీ మకర సంక్రాంతి శుభకర క్రాన్తులివ్వాలని నా కామన.
Post a Comment