
పోదురు భార్య, బిడ్డలును, పోదురు బంధు సహోదరాళియున్
పోదురు సేవకీ జనము, పోవును సంపద, ప్రాణ మానముల్
పోదుసుమా త్వదీయ పద పూజల గల్గు ఫలమ్మనంతమై!
సాధు జనావనీ! శరణు శంకరి! చిన్మయ రూపిణీ ! ఉమా!
పద్యము తెలుగుల విద్యగు! హృద్యము చదువరుల కెన్న, నింపగు వినగా ! పద్యము కవితల కాద్యము! సద్యశమును కల్గజేయు చక్కగ కవికిన్!