padyam-hrudyam

kavitvam

Thursday, July 14, 2011

చిన్మయ రూపిణీ !


పలుకుల తల్లి ! నీ కృపకు పాత్రుని జేయవె జ్ఞాన మిచ్చి నన్
కలుముల కాంత ! నీ కరుణ కాంచన మిచ్చి కుబేరు జేయవే
చలువులగట్టు పుత్రి ! భవ జాడ్యము బాపి పరమ్ము జూపవే
చిలుకవె నీ దయామృతము చిన్మయ రూపిణి ! చిద్విలాసినీ !

2 comments:

హనుమంత రావు said...

అర్థమడిగావు, ఙ్ఞానమడిగావు, పరమూ అడిగావు...బాగుంది..ఏదిచ్చినా
ముగ్గురమ్మలూ ఇవ్వాలి...ముగురమ్మల మూలపుటమ్మ ఇవ్వాలి.
మకుటం మార్చావేమి? శతకం పూర్తయ్యాక క్రొత్త శతకమా?

మిస్సన్న said...

అయ్యా గురువుగారూ నాకున్న అల్ప పరిజ్ఞానానికి
' చిన్మయ రూపిణి ' చివరి పాదంలో కనుపించి కనువిందు చేస్తోంది. అంతే. మకుటాన్ని తనలోకంలోనే ఉంచుకున్నదా జనని.