padyam-hrudyam

kavitvam

Friday, July 1, 2011

చిన్మయ రూపిణీ !


నీ కరుణన్ సృజించెడిని నీరజ సంభవు డెల్ల లోకముల్,
నీ కృప నేలు లోకముల నీరజ నాభుడనంత శక్తుడై,
నీ కను లెఱ్ఱ నౌటను త్రినేత్రుడు వాని లయింప జేసెడిన్!
శ్రీకర మౌను నీ రచన! చిన్మయ రూపిణి! చిద్విలాసినీ!

2 comments:

చింతా రామ కృష్ణా రావు. said...

అమ్మ నిజస్వరూపము, సమంచిత తత్వము గాంచినారు.మీ
కమ్మని పద్య భావనను గాంచక యుండుదురే త్రిమూర్తులున్?
సమ్మతి తోడ సత్కవులు చాలగ మెత్తురు మీదు పద్యమున్.
అమ్మ కటాక్షమబ్బి, పరమాద్భుత శక్తిని కన్న మిస్సనా!

మిస్సన్న said...

ఆర్యా! ధన్యోస్మి.