padyam-hrudyam

kavitvam

Saturday, June 25, 2011

చిన్మయ రూపిణీ !


















నీ లలితా ధరమ్మునను నిత్యముఁ బూచెడి నవ్వు పువ్వులన్
మాలిమిఁ స్వీకరించుచును మాటికి దాల్చు నెడంద ప్రీతితో
నీలగళుండు ! భాగ్య మన నీదె గదా భువనైక సుందరీ!
శ్రీ లలితా! భవాని ! శివ! చిన్మయ రూపిణి ! లోక పాలినీ !

2 comments:

కంది శంకరయ్య said...

మీ బ్లాగు పేరుకు తగినట్లే పద్యం హృద్యంగా ఉంది.
చివరిపాదంలో అన్ని సంబోధనల మధ్య ‘విను’ శబ్దం పానకంలో పుడకలా ఉంది. దానికి అన్వయమూ లేదు. పార్వతికి ‘శివ’ అనే పేరు కూడా ఉంది కదా. ‘విను’ స్థానంలో ‘శివ’ పెడితా బాగుంటుందని నా సలహా.

మిస్సన్న said...

గురువుగారూ ధన్యోస్మి! మీ సలహా శిరోధార్యం. వెంటనే పద్యాన్ని సవరిస్తున్నాను. భవదీయుడు-మిస్సన్న.