కస్సున పడగెత్తి కాటువేయగ నెంచు
.....కాలాహి రీతిగా వ్రేల వేణి
సర్పంపు ముఖమున చయ్యన వెలివచ్చు
.....నాలుక రీతిగా చేల మెసగ
నెక్కు పెట్టిన విల్లు గ్రక్కున దరిజేరి
.....యెరగొను మిత్తి వా తెరవు దోప
లాగగా వింటిని సాగిన చేతూండ్లు
.....కాల పాశము రీతి కదలుచుండ
కన్ను తామర లెఱ్ఱనై కలత బెట్ట
ధరణి యొడిలోన దలవాల్చు తరుణ మనుచు
భీతి జెందగ నరకుడు నాతి సత్య
విక్రమించెను కృష్ణుడు విశ్రమించ.
No comments:
Post a Comment