పద్మకర! ప్రసన్నాస్య! సౌభాగ్యదాయి!
భాగ్యదా! భయభంజన భవ్యహస్త!
మణిగణాంచిత నానాభరణ వికాస!
దయను చూడుము వరలక్ష్మి! దండమమ్మ!
భక్త వాంఛాఫలప్రదా! బ్రహ్మ విష్ణు
శంకరాది సంసేవిత! శంఖపద్మ
పంకజాదినిధాన సంభావితాంక!
దయను చూడుము వరలక్ష్మి! దండమమ్మ!
సరసిజనయన! సరసిజకర! భగవతి!
శ్వేతగంధానులేపన! శ్వేత వస్త్ర!
శ్వేత మాల్యసుశోభిత ! విష్ణుపత్ని!
దయను చూడుము వరలక్ష్మి! దండమమ్మ!
No comments:
Post a Comment