ఆహ్వానం
పుస్తకావిష్కరణ సభ
కంది శంకరయ్య సగర్వంగా సమర్పించు
“జడ కందములు – మా కందములు”
116 కవుల పద్య సంకలనం
ఆవిష్కర్త : శ్రీ ముద్దు రాజయ్య అవధాని గారు
సమీక్షకులు : ప్రముఖ కవులు శ్రీ నారుమంచి అనంతకృష్ణ గారు
---oOo---
“తిరుప్పావై గజల్ మాలిక”
రచయిత్రి : డా. ఉమాదేవి జంధ్యాల
ఆవిష్కర్త : గజల్ కవులు శ్రీ టి.వి.యస్. రామకృష్ణ ఆచార్యులు గారు
సమీక్షకులు : ప్రముఖ కవులు శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు
---oOo---
వేదిక : వడ్డేపల్లి కమలమ్మ సీనియర్ సిటిజన్స్ భవనం,
పోస్టాఫీసు ప్రక్కన, వివేకానంద నగర్, కూకట్ పల్లి, హైదరాబాదు.
తేదీ : 8 – 7 – 2018 (ఆదివారం)
సమయం : (కచ్చితంగా) సా. 4 గం. నుండి సా. 6 గం. వరకు.
ఆహ్వానించువారు :
‘శంకరాభరణం’ ప్రచురణలు & జె.వి. పబ్లికేషన్స్, హైదరాబాదు.
‘ఫెడరేషన్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్, కూకట్ పల్లి చాప్టర్ వారిసౌజన్యంతో…
---------------------------------------------------------------------------------------------------------
అందములు వాణి కీ జడ
కందములు మనోజ్ఞమైన కైతల కివి సం
బంధములు కావ్య వన మా
కందములును తెలుగు తల్లి కచబంధము నౌ.
***
సంధ్యా కాలమునందు గోపికలతో సంరంభమై యుండ స
ద్వంద్యుండౌ హరి యాలకించెను తిరుప్పావై గజల్మాల సౌ
గంధ్యమ్ముం గొనియాడ వక్త,, లడిగెన్ కన్నయ్య వైనమ్ముకై,
"జంధ్యాలాన్వయ రత్న మ య్యుమ కృతిన్ శ్లాఘించుటల్, పాప దౌ
ర్గంధ్యమ్మున్ హరియించు నయ్యది" యనెన్ రాధమ్మ, వింటే? భళీ!
No comments:
Post a Comment