padyam-hrudyam

kavitvam

Tuesday, February 27, 2018

శ్రీదేవికి నివాళి

అతిలోక సుందరి క్షితి వీడి నందన
....వని కేగె చూపుల తనుప సురల
వాసంత కోకిల స్వర్గ సీమను పాడ
....వలస పోయెను వీడి వసుధ వనుల 
తెర పైన దేవత పరలోక వేదిక
....నలరించ పయనించె నిలను విడచి
కార్తీక దీపమ్ము వర్తిని గోల్పోయి
....దీప్తుల మాసెను తిమిర మంట

వృద్ధయై కుమిలె పదహారేళ్ళ వయసు
వాడె వజ్రాయుధము వీడి వాడి వేడి
శిక్ష అభిమాన తతికి క్షణక్షణమ్ము
బావురనె చిత్రసీమ శ్రీదేవి లేక.

No comments: