padyam-hrudyam

kavitvam

Wednesday, February 21, 2018

మాతృభాష కు వందనం.

మాతృభాషను నీవు మాటాడ వోవునే
.....మానమర్యాదలు హీన మతివె?
తల్లిపల్కున నీవు సల్లపనము లాడ
.....పరు వేమి మాయునే భ్రష్ట మతివె?
అమ్మబాసను నీవు హాయిగా భాషింప
.....అవమాన మగునేమి యల్ప మతివె?
తల్లిదండ్రుల వాణి తలపోయ నేర్వవు
.....కొంచెమౌనా యేమి కొంచె మతివె?

కోకిలమ్మ గూట కూసెడు కాకివే
నీదు భాష విడచి నిజము మరచి
పరుల బాస వెంట పరువెత్తి పోదువు
జడుడ నిన్ను గన్న కడుపు చేటు.

***
దువ్వూరి వి యన్ సుబ్బారావు.  

No comments: