padyam-hrudyam

kavitvam

Thursday, December 14, 2017

చిన్మయ రూపిణీ !



మచ్చిక జేయ దానె కరి మావటి కిచ్చును కట్ట ద్రాడు నా
నిచ్చలు నా మనోగజము నీ పద పాదిక గట్ట వేడెదన్
మచ్చిక జేసి, నా కిడుము మాలిమి నీ పదభక్తి రజ్జువున్,
రచ్చను జేయ బోదు కరి రమ్మిక చిన్మయరూపిణీ! శివా!

( పాదిక = గుంజ, కట్రాట )   

No comments: