చల్లని వేళలో నెడద ఝల్లన తోచును భావమందు నీ
మెల్లని మందహాసమును మేటి కబంధము వక్రతుండమున్
ఫుల్ల సరోజ నేత్రముల పొంగు కృపారస వాహినీ ఘృణుల్
వల్లభదేవిహృత్కమలబంభర! వందనమయ్య దేవరా!
ప్రల్లద మేది నీ చరణ పంకజముల్ శరణన్న వారమే
చల్లగ జూడు మయ్య మము సారెకు మ్రొక్కుదుమయ్య విఘ్నముల్
త్రెళ్ళగ జేయుమయ్య భవదీయ కటాక్షమె రక్ష మాకు నో
వల్లభ విఘ్నరాజ! మదవారణవక్త్ర! మహా గణాధిపా!
No comments:
Post a Comment