పిల్లకై బువ్వను తల్లి గుండెలలోన
...............దాచి యుంచిన యట్టి దయకు నెలవు!
మధుపమ్ము కోసమై మధువును పూలలో
...............కల్పించి యుంచిన కరుణ కిరవు!
విత్తులో జీవమున్ బెట్టి నిద్దుర బుచ్చి
..............మొలకెత్త జేసెడు కళకు మురు!
నేలను గాలిని నీటిని జీవరా
................శుల నిల్పి పోషించు శోభ కనువు!
విశ్వ నిర్మాణకర్త వైవిధ్య భరిత
సృష్టి శైలిని పరికించి చింత జేసి
మమత నిండిన శక్తికి మరలమరల
కైమొగిడ్చెద నాతని కళకు మురిసి.
No comments:
Post a Comment