padyam-hrudyam

kavitvam

Monday, July 22, 2013

గురు పూర్ణిమ

అజ్ఞాన ధ్వాంతములను
ప్రజ్ఞా దీధితులతోడ బారద్రోలున్
సుజ్ఞానము దయజేయును
విజ్ఞానాదిత్యుడగుచు వెల్గెడు గురుడే.

శంకరుని రూపమున దొల్త సంభవించి
మధ్యలో శంకరాచార్య మహిమ గలసి
అస్మా దాచార్య పర్యంత మవని నైన
గురు పరంపరకనయము కరము మోడ్తు.

మొదట నారాయణుని రూపమునను నిలచి
వ్యాస వాల్మీకులయి మధ్య వాసికెక్కి
అస్మ దాచార్య పర్యంత మవని వెలుగు
గురు పరంపర స్మరియింతు కరము మోడ్చి.



3 comments:

వెంకట రాజారావు . లక్కాకుల said...

గురు పూర్ణిమ శుభ దినమున
సురుచిరముగ తెలుగు పద్య జ్యోత్స్నలు గురిసెన్
అరుదగు మా కవి మిత్రుని
విరచిత పద్యాలు మాకు విన సొంపయ్యెన్ .
----- బ్లాగు: సుజన-సృజన

వెంకట రాజారావు . లక్కాకుల said...
This comment has been removed by the author.
మిస్సన్న said...

మిత్రమా! రాజారావుగారూ! ధన్యవాదాలు.